రాయపోల్ : తెలంగాణ ( Telangana ) రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ ( KCR ) కే దక్కుతుందని బీఆర్ఎస్ మండల
అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ ( Venkateshwar Sharma ) అన్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా నిలబడుతుందన్నారు.

రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.