Watch: ఎత్తైన వాహనం నడిపిన మహిళ.. లంబోర్ఘిని పైకి దూకించింది, తర్వాత ఏం జరిగిందంటే?
Woman Crushes Lamborghini With Truck | ఒక మహిళ ఎత్తైన భారీ వాహనాన్ని నడిపింది. ముందున్న ఖరీదైన లంబోర్ఘిని ఆమె గమనించలేదు. దీంతో స్పోర్ట్స్ కారుపైకి భారీ వాహనం దూసుకెళ్లడంతో అది నుజ్జునుజ్జు అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వాషింగ్టన్: ఒక మహిళ ఎత్తైన భారీ వాహనాన్ని నడిపింది. ముందున్న ఖరీదైన లంబోర్ఘిని ఆమె గమనించలేదు. దీంతో స్పోర్ట్స్ కారుపైకి భారీ వాహనం దూసుకెళ్లడంతో అది నుజ్జునుజ్జు అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Crushes Lamborghini With Truck) అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ సంఘటన జరిగింది. సుమారు రూ. 3.4 కోట్లకు పైగా విలువైన లంబోర్ఘిని హురాకాన్ను ఒక పార్కింగ్ స్థలంలో పార్క్ చేసేందుకు దాని యజయాని ప్రయత్నించాడు. ఆ కారును మెల్లగా వెనక్కి నడుపుతున్నాడు.
కాగా, ఎత్తైన చెవ్రొలెట్ సిల్వరాడో వాహనాన్ని ఒక మహిళ నడిపింది. ఆ పెద్ద వాహనం చాలా ఎత్తుగా ఉండటంతో ముందున్న చిన్నగా ఉన్న లంబోర్ఘిని ఆమెకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆ భారీ వాహనం దానిపైకి దూసుకెళ్లింది. ఏదో జరిగినట్లు గ్రహించిన ఆ మహిళ చెవ్రొలెట్ సిల్వరాడో నుంచి కిందకు దిగింది. లంబోర్ఘిని ధ్వంసం కావడాన్ని ఆమె పరిశీలించింది.
మరోవైపు అదృష్టవశాత్తు లంబోర్ఘిని యజమానికి ఏమీ కాలేదు. అయితే ఖరీదైన తన కారు నుజ్జు కావడంపై అతడు ఆందోళన చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఎత్తైన వాహనాల డ్రైవింగ్‌పై ఆన్లైన్లో పెద్ద చర్చకు దారి తీసింది.
NEW: Florida woman drives her lifted truck over a Lamborghini in a parking lot after saying she didn’t see it
Footage shows the Lamborghini moving slowly through a parking lot while the Silverado entered at a higher speed before impact
The truck drove up onto the Lamborghini… pic.twitter.com/VmYsHzNZLR
— Unlimited L’s (@unlimited_ls) April 23, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

