లక్నో: ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని కొందరు వ్యక్తులు గమనించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రోడ్డుపై పడిన సుమారు రూ.4 లక్షల డబ్బును సేకరించారు. (Cash rain on UP highway) ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మీరట్-కర్నాల్ జాతీయ రహదారిలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బ్యాగు నుంచి నోట్ల కట్టలు రోడ్డుపై పడ్డాయి. సుమారు అర కిలోమీటరు వరకు రూ.500, రూ. 200 నోట్లు చెల్లాచెదురుగా కనిపించాయి.
కాగా, దీనిని గమనించిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న నోట్లను సేకరించారు. వాటిని లెక్కించగా రూ.4 లక్షలుగా తేలింది.
మరోవైపు కొన్ని నోట్ల కట్టలకు బ్యాంకు స్లిప్‌లు ఉన్నాయి. దీంతో ఆ డబ్బును బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా అవి పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
అయితే డబ్బు పోగొట్టుకున్నట్లు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఆ డబ్బుకు సంబంధించిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
అలాగే ఆ డబ్బు మూలాన్ని గుర్తించేందుకు సంబంధిత బ్యాంకును సంప్రదిస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే ఆధారాలతో పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Shamli, around ₹4 lakh was found scattered across half a kilometer on Meerut-Karnal highway. A man named Amit Kumar noticed cash falling from a biker’s bag, informed the police, and helped collect it.
Police recovered the money, including bundles of ₹500 and ₹200 notes,… pic.twitter.com/43imNGKUyc
— Oppressor (@TyrantOppressor) April 25, 2026
Also Read:
Uddhav Thackeray | ఉద్ధవ్ ‘సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో ఎంపీల సమావేశాలు
3 Killed In Birthday Party | బర్త్ డే పార్టీలో కేక్ పూయడంపై వివాదం.. కాల్పుల్లో ముగ్గురు మృతి
Watch: ఎత్తైన వాహనం నడిపిన మహిళ.. లంబోర్ఘిని పైకి దూకించింది, తర్వాత ఏం జరిగిందంటే?