3 Killed In Birthday Party | బర్త్ డే పార్టీలో కేక్ పూయడంపై వివాదం.. కాల్పుల్లో ముగ్గురు మృతి
3 Killed In Birthday Party | బర్త్ డే జరుపుకున్న వ్యక్తి ముఖానికి కేక్ పూయడంపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
లక్నో: బర్త్ డే జరుపుకున్న వ్యక్తి ముఖానికి కేక్ పూయడంపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (3 Killed In Birthday Party) ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖుర్జా నగర్ ప్రాంతానికి చెందిన జీతు సైని శనివారం రాత్రి ఒక జిమ్‌లో తన పుట్టిన రోజు వేడుక జరుపుకున్నాడు. బర్త్ డే వేడుకలో పాల్గొన్న అమర్దీప్ సైని అతడి ముఖానికి కేక్ పూశాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
కాగా, అమర్దీప్ సైని బంధువులైన మనీష్ సైని, ఆకాష్ సైని ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన జీతు సైని గన్ తెచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల్లో గాయపడిన అమర్దీప్, మనీష్, ఆకాష్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ముగ్గురు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man’s Hands Cut With Grinder | డబ్బు చెల్లింపుపై వివాదం.. మెషిన్‌తో వ్యక్తి చేతులు కోత
Imphal rally turns tense | మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సీఎం నివాసం వద్దకు ర్యాలీకి నిరసకారులు యత్నం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

