లక్నో: మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి తన కుటుంబంతో గొడవ పడ్డాడు. ఆ రాత్రివేళ మూడేళ్ల కుమారుడి గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (man slits son’s throat, hangs self) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధిమర్పురా గ్రామానికి చెందిన 38 ఏళ్ల ప్రేమ్ సింగ్ ఒక పెళ్లికి హాజరయ్యాడు. మద్యం సేవించిన అతడు ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
కాగా, ప్రేమ్ సింగ్ మద్యం సేవించడాన్ని కుటుంబ సభ్యులు నిలదీశారు. ఈ సందర్భంగా తల్లి, భార్యతో అతడు గొడవ పడ్డాడు. అర్ధరాత్రి వేళ తన పిల్లల్లో చిన్నావాడు, ఏకైక కుమారుడైన మూడేళ్ల భరత్‌ను ఎత్తుకుని మరో గదిలోకి తీసుకువెళ్లాడు. కత్తితో ఆ చిన్నారి గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు మధ్య రాత్రి వేళ మేల్కొన్న భార్య ఆశా తన కుమారుడిని తెచ్చేందుకు ఆ గది వద్దకు వెళ్లింది. లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో పలుమార్లు తట్టింది. భర్త నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీ నుంచి చూసింది. రక్తం మడుగులో కుమారుడు పడి ఉండగా, ఉరికి వేలాడుతూ భర్త కనిపించాడు. ఇది చూసి ఆమె షాక్ అయ్యింది.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. డోర్ బ్రేక్ చేసి గదిలోకి వెళ్లి చూశారు. కుమారుడి గొంతుకోసి చంపిన తర్వాత ప్రేమ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Man’s Hands Cut With Grinder | డబ్బు చెల్లింపుపై వివాదం.. మెషిన్‌తో వ్యక్తి చేతులు కోత
Watch: ఎత్తైన వాహనం నడిపిన మహిళ.. లంబోర్ఘిని పైకి దూకించింది, తర్వాత ఏం జరిగిందంటే?