Constable’s Lover Stabs His Wife, Son | కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని.. కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Constable's Lover Stabs His Wife, Son | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు.
రాయ్‌పూర్: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు. (Constable’s Lover Stabs His Wife, Son) అతడి ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ ప్రియురాలైన 25 ఏళ్ల సరోజిని భరద్వాజ్ అతడి ఇంటికి చేరుకున్నది. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. తన కుటుంబం ప్రయాణం కోసం టిక్కెట్లు కొనడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.
కాగా, కానిస్టేబుల్ భార్య రీనాతో సరోజిని వాగ్వాదానికి దిగింది. గొడవ బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచింది. ఆ తర్వాత రీనా, ఆమె ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. రీనాతో పాటు నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల ఆదిత్యను పదేపదే కత్తితో పొడిచింది.
అయితే కుమార్తెలు నైనా, తానియాపై సరోజిని కత్తితో దాడి చేస్తుండగా రీనా ప్రతిఘటించింది. ఆమె కాళ్లు పట్టుకుని తన పిల్లలను వదిలిపెట్టమని వేడుకున్నది. కుమార్తెలను పారిపోమని చెప్పింది. దీంతో ఒక కుమార్తె బాత్రూమ్లో దాక్కోగా, మరో కుమార్తె తప్పించుకుని బయటకు పరుగెత్తింది. పొరుగువారిని అప్రమత్తం చేసింది.
మరోవైపు పొరుగువారు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తపు మరకలున్న కత్తితో తలుపు దగ్గర ఉన్న సరోజినిని చుట్టుముట్టి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను అప్పగించారు. రీనా, ఆమె పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెతో పాటు కుమారుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది.
కాగా, కానిస్టేబుల్ లలితేష్, సరోజిని మధ్య ఉన్న సంబంధం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీస్ అధికారి తెలిపారు. శుక్రవారం కూడా ఆమె అతడి ఇంటికి రాగా నచ్చజెప్పి పంపించినట్లు తెలిసిందన్నారు. శనివారం లలితేష్ ఇంట్లో లేని సమయంలో వచ్చిన సరోజిని అక్కడ రక్తపాతం సృష్టించిందని చెప్పారు. నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also read:
Woman Stabs Lover’s Wife | ప్రియుడి ఇంటికి వెళ్లి.. అతడి భార్యను దారుణంగా చంపిన ప్రియురాలు
nail house resistance | చైనా తరహాలో.. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలో ‘నెయిల్ హౌస్’ ప్రతిఘటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

