Woman Stabs Lover’s Wife | ప్రియుడి ఇంటికి వెళ్లి.. అతడి భార్యను దారుణంగా చంపిన ప్రియురాలు
Woman Stabs Lover's Wife | ఒక మహిళ తన ప్రియుడి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న అతడి భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపింది. గమనించిన స్థానికులు ఆ ఇంటి డోర్‌ను బయట నుంచి లాక్ వేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు.
ముంబై: ఒక మహిళ తన ప్రియుడి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న అతడి భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపింది. గమనించిన స్థానికులు ఆ ఇంటి డోర్‌ను బయట నుంచి లాక్ వేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు. (Woman Stabs Lover’s Wife) మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 22న తెల్లవారుజామున 45 ఏళ్ల షీలా సోనార్ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. తుపాకీ, కత్తి, స్ప్రే, తాళం వంటి వస్తువులతో ప్రియుడి ఇంటికి వెళ్లింది. ప్రియుడి భార్య అయిన 40 ఏళ్ల సాధన మహేంద్ర సోన్పట్కర్పై ఉన్మాదంతో ఆమె దాడి చేసింది.
కాగా, ఆ సమయంలో ఇంట్లో ఉన్న సాధన అత్త, షీలా సోనార్ చేతిలోని గన్ తీసుకుని కిటికీ నుంచి బయటకు విసిరేసింది. ఈ నేపథ్యంలో షీలా కత్తితో సాధనపై దాడి చేసింది. నేలపై పడిన ఆమె మెడపై ఆ తర్వాత ఛాతిపై పదిసార్లు కత్తితో పొడిచింది. పక్కనే సోఫాలో కూర్చొన్న సాధన అత్త ఏడుస్తూ ఈ దారుణాన్ని ఆపమని షీలాను వేడుకున్నది. తీవ్ర రక్తస్రావం వల్ల సాధన అక్కడికక్కడే మరణించింది.

Woman Stabs Lover’s Wife
మరోవైపు అరుపులు విన్న స్థానికులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. కిటికీలోంచి ఈ దారుణాన్ని చూశారు. అయితే షీలా బారి నుంచి సాధనను రక్షించలేకపోయారు. బయటి నుంచి డోర్ లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు.
ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు జరిగిన నేరాన్ని పరిశీలించారు. నిందితురాలు షీలాను అరెస్ట్ చేశారు. హత్యకు గురైన సాధన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత వివాదం, వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణాలని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Tejashwi Yadav | నితీశ్ కుమార్‌ను రాజకీయంగా బీజేపీ అంతం చేసింది: తేజస్వీ యాదవ్
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

