న్యూఢిల్లీ: డబ్బు చెల్లింపుపై వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు టెంట్ సర్వీస్ వ్యక్తి చేతులను మెషిన్‌తో కోశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. (Man’s Hands Cut With Grinder) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ద్వారకా ప్రాంతంలోని విజయ్ ఎన్‌క్లేవ్‌లో నివసించే 32 ఏళ్ల లోకేష్ గుప్తా టెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల అజయ్ పాల్, ఏప్రిల్ 20న జరిగిన తన కుమార్తె వివాహం కోసం టెంట్ సేవలను రూ. 2.5 లక్షలకు లోకేష్‌తో మాట్లాడుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.50,000 చెల్లించాడు.
కాగా, ఏప్రిల్ 24న రాత్రి 8 గంటల సమయంలో మిగిలిన రూ.2 లక్షలు చెల్లింపు కోసం అజయ్ పాల్ ఇంటికి లోకేష్ వెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ పాల్ మరో ఇద్దరితో కలిసి గ్రైండర్తో లోకేష్ చేతులను కట్ చేశాడు. తీవ్రంగా గాయపడిన లోకేష్‌ను తొలుత స్థానిక హాస్పిటల్‌కు ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు లోకేష్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ప్రధాన నిందితుడు అజయ్ పాల్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Update
Accused Ajay Pal Held in Delhi Grinder Attack Case
New Delhi: Delhi Police has arrested the main accused in the brutal Dabri grinder attack case where a man was grievously injured over a payment dispute.
Two juveniles have also been detained. Further investigation is… https://t.co/2DRmBVkREy
— Atulkrishan (@iAtulKrishan1) April 25, 2026