కోయంబత్తూరు: కావేరి నదీ జలాలు(Cauvery Water) ఇవాళ తమిళనాడు చేరుకున్నాయి. కర్నాటకలోని కాబిని డ్యామ్ నుంచి రిలీజ్ చేసిన నీరు .. తమిళనాడులోని ఎంట్రీ పాయింట్ బిలిగుండ్లకు చేరుకున్నది. బిలిగుండ్ల వద్ద నీటి ప్రవాహ ఉదృతి పెరిగింది. సోమవారం ఉదయం 500 క్యూసెక్కులు ఉండగా, ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఆ ప్రవాహం 1000 క్యూసెక్కులకు చేరుకున్నది. ఉదయం 7 గంటలకు 8వేల క్యూసెక్కులు కాగా, ఉదయం 10 గంటలకు 18వేల క్యూసెక్కులకు చేరుకున్నది. అయితే కర్నాటక నీరును విడుదల చేస్తున్న నేపథ్యంలో కావేరి నది ప్రవాహ ఉదృతి పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాబిని, కృష్ణ రాజ సాగర డ్యామ్‌ల నుంచి సుమారు 27 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కావేరి పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడం వల్ల నదిలోకి నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. తాజాగా వస్తున్న నీరు.. మంగళవారం సాయంత్రం లేదా రాత్రి వరకు మెట్టూరు డ్యామ్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మెట్టూరు రిజర్వాయర్‌లో నీటి సామర్థ్యం 73.18 ఫీట్ల వద్ద ఉన్నది. ఆ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 120 ఫీట్లుగా ఉంది. ఆ డ్యామ్‌కు 68 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, దాని నుంచి 1500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తున్నారు. మెట్టూరు డ్యామ్‌కు నీరు చేరితే అప్పుడు దిగువన ఉన్న డెల్టా ప్రాంత రైతులు సేద తీరే అవకాశాలు ఉన్నాయి.
Water released from Kabini dam reaches Tamil Nadu near Biligundulu near #Hogenakkal on Tuesday early morning.
Hogenakkal received an inflow of 8,000 cusecs, expected to go up to over 20,000 cusecs, shortly.@xpresstn @NewIndianXpress #Cauvery pic.twitter.com/rSagNqTh8Y
— S Mannar Mannan (@mannar_mannan) August 4, 2026
మరో వైపు సోమవారం కావేరి నదీ జలాల కోసం ఓ సభలో మాట్లాడుతూ.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినీ నటి త్రిష గురించి ఆయన చేసిన కామెంట్ దుమారం రేపడంతో.. ప్రస్తుతం ఉదయనిధిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
#WATCH | DMK leader and LoP Udhayanidhi Stalin detained by Police from his Chennai residence, following an FIR against him over his alleged defamatory remarks against CM Vijay. Slogans directed at actor Trisha were raised at his rally yesterday. pic.twitter.com/wTM6rABo85
— ANI (@ANI) August 4, 2026