స్వదేశీ టర్బోజెట్ ఇంజిన్ తయారీపై కేటీఆర్ హర్షం.. డీఆర్డీవో, ఆజాద్ ఇంజినీరింగ్‌కు అభినందనలు
దేశంలో తొలి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ విజయవంతంగా తయారవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్, డీఆర్డీవో (DRDO) సంయుక్తంగా సాధించిన ఈ ఘనత హైదరాబాద్‌తో పాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
దేశంలో తొలి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ విజయవంతంగా తయారవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్, డీఆర్డీవో (DRDO) సంయుక్తంగా సాధించిన ఈ ఘనత హైదరాబాద్‌తో పాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు.
హైదరాబాద్‌లో తయారైన ఈ టర్బోజెట్ ఇంజిన్ భారతదేశపు స్వదేశీ ప్రొపల్షన్ సామర్థ్యాలను, రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జెట్ ఇంజిన్ సాంకేతికతకు అత్యంత కచ్చితత్వం, అధునాతన మెటలర్జీ, ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు.
ఈ విజయం హైదరాబాద్‌లో దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఏరోస్పేస్, ప్రిసిషన్ ఇంజినీరింగ్ రంగాల సామర్థ్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో ఈ రంగం మరింత బలోపేతం కావడం వల్లే ఇలాంటి చారిత్రాత్మక ఘనత సాధ్యమైందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఈ విజయం మరింత ఊతమిస్తుందని, ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ హబ్‌గా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఆజాద్ ఇంజినీరింగ్, డీఆర్డీవో బృందాలకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

