Mumbai | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బీఎండబ్ల్యూ కార్.. ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
Mumbai : ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Mumbai : మహారాష్ట్రలోని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి.
ఈ ఘటన ముంబై, కోస్టల్ రోడ్, లాలాలజపతిరాయ్ ఎదురుగా ఉన్న లాలా కాలేజ్ వద్ద ఆదివారం వేకువఝామున 5.20 గంటలకు జరిగింది. నలుగురు ప్రయాణికులతో కూడిన ఒక బీఎండబ్ల్యూ కార్ మెరైన్ డ్రైవ్ ప్రాంతం నుంచి హజి అలీ ప్రాంతాని వెళ్తుండగా.. అతివేగం కారణంగా అదుపుతప్పింది. దీంతో బ్రిడ్జిపై నుంచి 70 అడుగుల కింద ఉన్న స్థలంలో పడిపోయింది. అది కూడా కారు అతివేగంగా పడటం వల్ల కారులోని నలుగురిలో ముగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Car flew off the bridge to floor 70+ feet below. pic.twitter.com/llRxbyD6mx
— BantuM (@bantumukka) September 20, 2026
వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ముగ్గురు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్ (23) అనే వ్యక్తి చికిత్స పొందుతుండగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిని షనయ్ గజ్జల్ (21), ధైర్య దర్శన్ షేత్ (17), ఆదిత్య జకాసనియా (23)గా గుర్తించారు. వీరి మృతదేహాల్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

