Religious Harmony | వెల్లివిరిసిన మతసామరస్యం.. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు
Religious Harmony | ఏపీలో గణేష్ నవరాత్రులు ఉత్సహంగా కొనసాగుతున్నాయి.
అమరావతి : ఏపీలో గణేష్ నవరాత్రులు ( Ganesh Festivals) ఉత్సహంగా కొనసాగుతున్నాయి. వాడవాడన వెలసిన వినాయక విగ్రహాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు గణేషున్ని ప్రతిష్టించిన మండపాలను అందంగా అలంకరించారు. కొంత మంది మూడు రోజులకు మరికొంత మంది 5, ఇంకొంత మంది 9 రోజులకు వినాయకున్ని నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపాల వద్ద నిర్వహిస్తున్న లడ్డూ వేలంపాట కార్యక్రమాలు ఉల్లాసంగా నిర్వహిస్తున్నారు.
శ్రీసత్యసాయి ( Satyasai District ) జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్ సమీపంలో వినాయకుడి విగ్రహం వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు ( Muslim couple ) చాందిని, మస్తాన్ వలి వేలంపాటలో దక్కించుకున్నారు. వినాయకుడి వద్ద నిర్వహించిన వేలంపాటలో రూ.1,45,000లకు లడ్డూను దక్కించుకుని మత సామరస్యాన్ని చాటుకుని ప్రశంసలు అందుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

