Uddhav Thackeray | ఉద్ధవ్ ‘సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో ఎంపీల సమావేశాలు
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరో చీలిక ఎదుర్కోనున్నట్లు కనిపిస్తున్నది. ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తున్నది.
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరో చీలిక ఎదుర్కోనున్నట్లు కనిపిస్తున్నది. ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తున్నది. (Uddhav Thackeray) మరాఠ్వాడా ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన సంజయ్ జాదవ్, ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీలో జరిగిన కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే సేనా భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సభ్యుల మరో సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో సంజయ్ జాదవ్ గైర్హాజరు పార్టీ వర్గాల్లో ఆందోళనలు రేకెత్తించింది. అప్పటి నుంచి ఆయన అందుబాటులో లేరని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, శివసేన (యూబీటీ)కి చెందిన హింగోలి నియోజకవర్గం ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్, యవత్మల్-వషీం నియోజకవర్గం ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్ కలిసి ఇటీవల కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ ఢిల్లీలో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సంజయ్ జాదవ్ ఢిల్లీలో కలిసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఏదో రాజకీయ మంతనాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
మరోవైపు శివసేన (యూబీటీ) అగ్రనాయకత్వం, ఆ పార్టీ ఎంపీల మధ్య సమన్వయం లేనట్లు తెలుస్తున్నది. దీని పట్ల కొందరు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు ఇది కారణమని వారు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు శివసేనను చీల్చిన మాదిరిగా నాలుగేళ్ల తర్వాత శివసేన (యూబీటీ)లో మరో చీలిక రావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:
Imphal rally turns tense | మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సీఎం నివాసం వద్దకు ర్యాలీకి నిరసకారులు యత్నం
Man’s Hands Cut With Grinder | డబ్బు చెల్లింపుపై వివాదం.. మెషిన్‌తో వ్యక్తి చేతులు కోత
3 Killed In Birthday Party | బర్త్ డే పార్టీలో కేక్ పూయడంపై వివాదం.. కాల్పుల్లో ముగ్గురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

