‘ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపి వెంటనే ఎగుమతి చేయాలి’
రైతుల వద్ద నుండి ఎక్కువ తూకం తూసుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంట వెంటనే లారీలు పంపించి ఎగుమతులు త్వరితగతిన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో..
నల్గొండ రూరల్, ఏప్రిల్ 27 : రైతుల వద్ద నుండి ఎక్కువ తూకం తూసుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంట వెంటనే లారీలు పంపించి ఎగుమతులు త్వరితగతిన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని 11వ డివిజన్ మామిళ్ళగూడెంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కేజీల 650 గ్రాములు తూకం వేయాల్సి ఉండగా 42 కేజీలు తూకం వేయడంతో పాటు రైస్ మిల్లులకు వెళ్లిన తర్వాత మరో కేజీ కటింగ్ చేస్తున్నారన్నారు. ఆరుగాలం శ్రమించి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి అమ్ముకోవడానికి అవస్థలు పడడం బాధాకరం అన్నారు.
సకాలంలో లారీలు పంపించి కాంట వేసిన వడ్లను వెంటనే ఎగుమతి అయ్యే విధంగా అధికారులు చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులను అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద హశం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ, 11వ డివిజన్ శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, వార్డు పెద్దలు, రైతులు పాలకూరి సంతోష్, పజ్జురి శేఖర్, దండంపల్లి యాదయ్య, మారయ్య, పనస దేవేందర్, అలుగుబెల్లీ రమణారెడ్డి, మెట్టు యాదయ్య, దండెంపల్లి అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

