జైపూర్: మండుతున్న ఎండల నేపథ్యంలో ఒక వ్యక్తి వినూత్నంగా రీల్ కోసం ప్రయత్నించాడు. పాల క్యాన్‌ను తలపై పెట్టుకున్నాడు. అయితే అతడి తల అందులో ఇరుక్కుపోయింది. చివరకు ఆ పాల క్యాన్‌ను మెషిన్ కట్టర్‌తో కట్ చేసి అతడ్ని రక్షించారు. (man head stuck in milk can) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాధోగఢ్ గ్రామానికి చెందిన కాలురామ్ గోధుమలు అమ్మేందుకు ఒక చోటకు వెళ్లాడు. అలాగే 15 లీటర్ల పాల క్యాన్‌ను కూడా అతడు తీసుకెళ్లాడు.
కాగా, ఎండాకాలం నేపథ్యంలో ఎండ నుంచి రక్షణ కోసం పాల క్యాన్‌ను తలపై పెట్టుకుని రీల్ రికార్డ్ చేసేందుకు కాలురామ్ ప్రయత్నించాడు. అయితే రీల్ స్టంట్ బెడిసికొట్టింది. అతడి తల ఆ పాల క్యాన్‌లో ఇరుక్కుపోయింది. అది చాలా బరువు ఉండటంతో తీసేందుకు కష్టంగా మారింది.
మరోవైపు కాలురామ్ పరిస్థితి గమనించిన గ్రామస్తులు అతడికి సహాయం కోసం ముందుకు వచ్చారు. ఒక వ్యక్తి బైక్‌పై హార్డ్‌వేర్ షాప్ వద్దకు అతడ్ని తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న వ్యక్తి మెషిన్ కట్టర్‌తో చాలా జాగ్రత్తగా ఆ పాల క్యాన్‌ను కట్ చేశాడు.
అయితే పాల క్యాన్‌ను కట్ చేసేటప్పుడు కాలురామ్ చాలా భయాందోళన చెందాడని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Reels का नशा इतना सवार हो गया कि अपने सिर में 15 लीटर की भारी दूध की केन फंस गई।
कोशिश करने पर कैन और फंस गई इसके बाद कटर से काटकर निकाला गया।👇🏻 pic.twitter.com/83MmDyL0LV
— BHUMI (@Bhumika_2024) April 26, 2026
Also Read:
Watch: రాహుల్, అఖిలేష్ దిష్టిబొమ్మల దహనం.. బీజేపీ మహిళా ఎమ్మెల్యేకు కాలిన గాయాలు
Watch| రోడ్డుపై చెల్లాచెదురుగా కరెన్సీ నోట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: దేవుడి ఊరేగింపు సందర్భంగా కూలిన వంతెన.. తర్వాత ఏం జరిగిందంటే?