Watch: రాహుల్, అఖిలేష్ దిష్టిబొమ్మల దహనం.. బీజేపీ మహిళా ఎమ్మెల్యేకు కాలిన గాయాలు
BJP MLA Anupama Jaiswal | మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే మంటలు అంటుకుని బీజేపీ మహిళా ఎమ్మెల్యేకు కాలిన గాయాలయ్యాయి.
లక్నో: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే మంటలు అంటుకుని బీజేపీ మహిళా ఎమ్మెల్యేకు కాలిన గాయాలయ్యాయి. (BJP MLA Anupama Jaiswal) ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా జనాక్రోష్ మార్చ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలకు బీజేపీ మహిళా ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ నిప్పు అంటించారు.
కాగా, ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ ముఖానికి మంటలు అంటుకున్నాయి. ఆమె నుదుటిపై కాలిన గాయాలయ్యాయి. ఆమె తలమీద జుట్టులో కొంతభాగం కాలిపోయింది.
మరోవైపు పక్కనే ఉన్న బీజేపీ నేతలు వెంటనే స్పందించారు. అనుపమ తలకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. తదుపరి వైద్యం కోసం లక్నోకు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#BREAKING : Former minister Anupama Jaiswal injured in Bahraich after effigy-burning protest goes wrong.
The incident occurred at DM Chauraha, and she has been admitted to the local medical college with burn injuries to her face.#Bahraich #AnupamaJaiswal #Protest… pic.twitter.com/7y53mXmr1c— upuknews (@upuknews1) April 25, 2026
Also Read:
Uddhav Thackeray | ఉద్ధవ్ ‘సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో ఎంపీల సమావేశాలు
3 Killed In Birthday Party | బర్త్ డే పార్టీలో కేక్ పూయడంపై వివాదం.. కాల్పుల్లో ముగ్గురు మృతి
Watch| రోడ్డుపై చెల్లాచెదురుగా కరెన్సీ నోట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

