The Black Gold | గెట్ రెడీ అంటోన్న భీమ్లా నాయక్ భామ.. ది బ్లాక్ గోల్డ్ నయా వీడియో చూశారా..?
The Black Gold | ప్రయాణికులెవరూ లేని రైల్వే ప్లాట్ ఫాంపై సంయుక్తా మీనన్ రౌడీ మూకలను ఊచకోత కోసినట్టు కనిపిస్తున్న ది బ్లాక్ గోల్డ్ (The Black Gold) పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మేకర్స్ ఫైనల్ అప్డేట్ అందించారు.
The Black Gold | భీమ్లా నాయక్, సార్, బింబిసారతోపాటు పలు సినిమాలతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. ఈ భామ తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రాబోతుంది. యోగేశ్ కేఎంసీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే ది బ్లాక్ గోల్డ్ (The Black Gold) టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలియజేస్తూ లుక్ కూడా విడుదల చేయగా నెట్టింట క్యూరియాసిటీ పెంచుతోంది.
ప్రయాణికులెవరూ లేని రైల్వే ప్లాట్ ఫాంపై సంయుక్తా మీనన్ రౌడీ మూకలను ఊచకోత కోసినట్టు కనిపిస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మేకర్స్ ఫైనల్ అప్డేట్ అందించారు. ది బ్లాక్ గోల్డ్ షూటింగ్ పూర్తయింది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు మేకర్స్. రాబోయే ఎక్జయిటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని ప్రకటించారు .ఈ సినిమా నల్లబంగారం (బొగ్గు)చుట్టూ తిరుగుతుందని డైరెక్టర్ హింట్ ఇచ్చినట్టు టైటిల్ లుక్ చెప్పకనే చెబుతోంది.
సంయుక్తామీనన్ సమర్పకురాలిగా కూడా వ్యవహరిస్తున్న ఈ మూవీని హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ వసంత్ సినిమాటోగ్రఫర్, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సంయుక్తా మీనన్ మరోవైపు నిఖిల్‌తో కలిసి స్వయంభు సినిమాలో నటిస్తోంది. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాతోపాటు మలయాళం, తమిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తోంది.
It’s a wrap for #TheBlackGold ❤️🔥
Loaded with action. Packed with power 👊💥
Now… all set to explode on the big screens 🔥@iamsamyuktha_ @HasyaMovies@RajeshDanda_pic.twitter.com/xEcYZ2iDY1
— Ramesh Bala (@rameshlaus) April 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

