అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ నాలుగోసారి రిపీట్

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని గ్రేట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు మరో రేంజ్లో ఉంటాయి. టాలీవుడ్లో అలాంటి అద్భుతమైన కాంబినేషన్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ బ్లాక్‌బస్టర్ జోడీ కలిసి పనిచేయబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
2012లో జులాయి సినిమాతో తొలిసారిగా బన్నీ, త్రివిక్రమ్ కలిసి పనిచేశారు. అప్పట్లోనే ఈ సినిమా 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 2015లో మరోసారి సన్నాఫ్ సత్యమూర్తి అంటూ వచ్చారు. ఇది 50 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి విజయం అందుకుంది. ఇక 2020లో ఈ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఏకంగా 150 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులు తిరగరాసింది. కొన్నిచోట్ల బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన రికార్డులు కూడా తిరగరాశాడు అల్లు అర్జున్. తాజాగా రాపిడో బైక్ ఆన్లైన్ అగ్రిగేటర్ యాడ్ కోసం కలిసి పనిచేశారు త్రివిక్రమ్, బన్నీ. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. కేవలం కమర్షియల్ యాడ్ కదా అని తీసి పారేయడానికి లేదు. ఎందుకంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అంత మ్యాజిక్ ఉంటుంది. ఈ రాపిడో యాడ్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు అభిమానులు. త్వరలోనే ఈ కమర్షియల్ యాడ్ టీవీలో ప్రసారం కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA Elections 2021 : ఎట్టకేలకు మా అధ్యక్ష ఎన్నికల తేదీలు ఖరారు.. మరి కండిషన్స్ ఏంటో తెలుసా !
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- trivikram
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

