Akhanda Movie | ఈ రోజుల్లో ఒక సినిమా ఒక వారం దాటి రెండో వారం కలెక్షన్లు తీసుకురావడమే గగనం. అలాంటిది సినిమా విడుదలై 46 రోజులు అవుతున్నా ఇప్పటికీ హౌజ్‌ఫుల్ కలెక్షన్స్ తీసుకొస్తూ రికార్డులు సృష్టిస్తుంది. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? అదే బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా. దీనికంటే ముందు విడుదలైన పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలు వెనక్కి తగ్గినప్పటికీ.. బాలకృష్ణ అఖండ సినిమా పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లను రాబడుతోంది.
అఖండ సినిమా 46వ రోజు ఏపీ, తెలంగాణలో రూ.22 లక్షల షేర్ వసూలు చేసింది. ఇది నిజంగా చిన్న విషయం కాదు.. ఎందుకంటే ఈ రోజుల్లో రెండు వారాలు సినిమా ఆడితేనే గగనం. అలాంటిది ఏకంగా ఏడు వారాల పాటు సినిమా థియేటర్స్‌లో ఉండటం అనేది ఒకరకంగా అసాధ్యం. కానీ దానిని సుసాధ్యం చేసి చూపించాడు బాలకృష్ణ. బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అఖండ చూడటానికి థియేటర్స్ వైపు వెళ్తున్నారు. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఈ సినిమాను ఓటీటీలోకి విడుదల చేయలేదు.
#AkhandaMassJathara Continues.. #Akhanda 🦁 Roaring at Box-office with Full packed theaters in Many centres on 46th day too!! 💥 #BlockbusterAkhanda #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @actorsrikanth @ItsMePragya @dwarakacreation #MiryalaRavinderReddy pic.twitter.com/S91Rv1Wph4
— BA Raju's Team (@baraju_SuperHit) January 16, 2022
నిజానికి సంక్రాంతికి ఈ సినిమాను హాట్ స్టార్ డిస్నీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ వీకెండ్ కలెక్షన్స్ బాగా ఉండటంతో మరో పది రోజులు ఆలస్యంగా సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత జనవరి 21న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత లాంగ్ రన్ ఉన్న సినిమా ఈ మధ్య కాలంలో మరొకటి లేదు. ఆ రికార్డు కేవలం బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైంది. మాస్లో ఈయనకు ఉన్న పట్టు ఎంత అనేది మరోసారి నిరూపించింది అఖండ. 54 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా ఏకంగా రూ.74 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికీ ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అఖండ 50రోజుల వేడుక ఘనంగా జరుపనున్నారు దర్శక నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
కొనసాగుతున్న బంగార్రాజు బాక్సాఫీస్ వేట.. 50 కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ..
Allu Arjun | హిందీలో ‘అల వైకుంఠపురములో’.. విడుదల ఎప్పుడంటే?