Bangarraju Collections | అనుకున్నట్లుగానే బంగార్రాజు మూడోరోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చాడు. నాగార్జున కెరీర్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరిపోయింది బంగార్రాజు. సినిమాపై ఉన్న భారీ అంచనాలను నిలబెట్టుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా టికెట్ రేట్ల విషయం తట్టుకొని.. మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు తన సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించదని.. విడుదలకు ముందు నాగార్జున చెప్పినట్లే జరుగుతుంది. తక్కువ టికెట్ రేట్స్‌తోనే బంగార్రాజు మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నాడు.
మూడు రోజుల్లోనే ఏపీ తెలంగాణలో కలిపి దాదాపు రూ.24 కోట్ల షేర్ వసూలు చేసింది బంగార్రాజు సినిమా. ప్రపంచ వ్యాప్తంగా రూ.27 కోట్లు వసూలు చేసింది. తెలంగాణలో ఇప్పటికే 7 కోట్లకు చేరువగా వచ్చింది. మరోవైపు ఓవర్సీస్ లో 1.20 కోట్లు, కర్ణాటకలో రూ.95 లక్షలు వసూలు చేసింది బంగార్రాజు. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. థియేటర్స్‌లో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా పండగ చేసుకుంటున్నారు. రూ.38 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే రూ.27 కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లోనే దాదాపు 65 శాతం రికవరీ తీసుకొచ్చింది.
ఇప్పటికీ కలెక్షన్స్ బాగానే ఉండటంతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వైపు బంగార్రాజు అడుగులు పడుతున్నాయి. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు అంచనాలు నిలబెట్టుకున్నాడు. కథ రొటీన్‌గానే ఉన్నా స్క్రీన్ ప్లే తెలివిగా ఉండటంతో ప్రేక్షకులు బంగార్రాజు మోజులో పడిపోయారు. దానికి తోడు నాగార్జున, నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. మొత్తానికి పండగ లాంటి సినిమా అంటూ సంక్రాంతికి వచ్చి కలెక్షన్ల పండగ చేసుకుంటున్నాడు నాగార్జున.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
Radhe shyam | ప్రభాస్ రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?