Radhe shyam | ప్రభాస్ రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

Prabhas Radhe shyam movie release date | సంక్రాంతి కానుకగా జనవరి 14న రావాల్సిన ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా అనుకోని విధంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల కానుందనేది అగమ్యగోచరంగా మారింది. మంచి విడుదల తేదీ చూసుకొని త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అని దర్శక నిర్మాతలు చెప్పారు. అయితే రాబోయే రెండు నెలలు కూడా పూర్తిగా కరోనా వైరస్ ప్రభావం భారత్‌లో ఉంటుందని ఇప్పటికే ఆరోగ్య శాఖ హెచ్చరించింది. దానికి తగ్గట్టుగానే రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే వాయిదా పడ్డ రాధే శ్యామ్ మళ్లీ ఎప్పుడు విడుదల కానుందనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
రాధేశ్యామ్ సినిమా మార్చి 17న విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఆరోజు అయితే సినిమా విడుదల తేదీకి అనువుగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ గోపి కృష్ణ మూవీ సంయుక్తంగా ఈ సినిమాను 150 కోట్లతో నిర్మించాయి. రాధాకృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాకు దర్శకుడు. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన మొదటి ప్రేమ కథ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా అందుకే అన్ని భాషలకు అనువుగా ఉండే విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అది మార్చి 17 అని తెలుస్తోంది. మరి అధికారికంగా అనౌన్స్ చేసేవరకూ వేచి చూడాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన మలయాళ నటి.. అసలు నిజం ఇది..
సమాజం రేపిస్టులనే ప్రేమిస్తోంది.. సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
Covid-19 | మలయాళీ సూపర్‌స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్
టాక్ బాగున్నా.. కలెక్షన్స్ లేవు.. అయ్యో పాపం ‘హీరో’..
మెగా అల్లుడిని కనీసం పట్టించుకోవడం లేదుగా.. సూపర్ మచ్చికి డెఫిషీట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

