Singer Chinmayi Sripaada | సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై సోషల్‌మీడియా వేదికగా తరచూ గళం విప్పుతూ ఉంటుంది ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద. మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఒక సంచలన ట్వీట్ చేసింది. ప్రముఖ మలయాళ నటి పార్వతి మీనన్‌కు మద్దతుగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి 2017లో సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం వెనుక ప్రముఖ మలయాళ నటుడు ఉన్నాడని తెలియడంతో ఈ కేసు సెన్సేషన్‌గా మారింది. ఆ సమయంలో ఆ హీరోయిన్‌పై జరిగిన అన్యాయంపై చాలామంది ప్రముఖులు మద్దతుగా నిలిచారు. వారిలో మలయాళ నటి పార్వతి మీనన్ ( పార్వతి తిరువోతు) కూడా ఉంది. బాధిత హీరోయిన్‌కు మద్దతుగా మహిళా సంఘాలతో కలిసి పార్వతి పోరాటం కూడా చేసింది. ఆ పోరాటం వల్ల తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని పార్వతి తిరువోతు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె నటించిన సినిమాలు హిట్ అయినప్పటికీ అవకాశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చింది. న్యాయానికి మద్దతుగా నిలిచిందుకు తనను బెదిరించారని కూడా చెప్పింది. అయితే పార్వతి వ్యాఖ్యలపై చిన్మయి స్పందించింది.
Actor Parvathy Thiruvoth on paying a price for speaking up.
— Chinmayi Sripaada (@Chinmayi) January 15, 2022
The fact that hyper talented actors such as she lost work JUST because they stood for a survivor of sexual assault in Kerala says a LOT!
So many women silenced.
Rapist loving society only. 🤮https://t.co/YINgJRux0L pic.twitter.com/OZFNV4ohg1
అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పార్వతి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చిన్మయి ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కేవలం బాధితురాలికి మద్దతుగా మాట్లాడినందుకు ఆమె అవకాశాలను కోల్పోయిందని ఆ ట్వీట్లో పేర్కొంది. చాలామంది మహిళలు మౌనంగానే ఉంటున్నారు. రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది. అంటూ చిన్మయి ట్వీట్ చేసింది. చిన్మయి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన మలయాళ నటి.. అసలు నిజం ఇది..
Covid-19 | మలయాళీ సూపర్‌స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్
టాక్ బాగున్నా.. కలెక్షన్స్ లేవు.. అయ్యో పాపం ‘హీరో’..
మెగా అల్లుడిని కనీసం పట్టించుకోవడం లేదుగా.. సూపర్ మచ్చికి డెఫిషీట్స్