టాక్ బాగున్నా.. కలెక్షన్స్ లేవు.. అయ్యో పాపం ‘హీరో’..

Hero movie | కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఉండవు. దానికి చాలా కారణాలు ఉంటాయి. హీరో మైనస్ అయ్యుండొచ్చు లేదంటే కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అదీ కాదంటే విడుదలైన సీజన్ కలిసి రాకపోవచ్చు. ఇప్పుడు గల్లా అశోక్ నటించిన హీరో సినిమా విషయంలో ఇదే జరుగుతుంది.
మహేశ్ బాబు ( Mahesh babu ) మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన సినిమా హీరో. ఎలాగైనా సినిమా హీరో అవ్వాలని అనుకునే ఒక కుర్రాడి కల ఈ సినిమా. జగపతి బాబు ( Jagapathi babu ), నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ), రవి కిషన్, అజయ్, నరేశ్ ఇలా సినిమా అంతా మంచి ప్యాడింగ్ ఉంది. పేరున్న నటులు ఈ సినిమాలో నటించారు. పైగా శ్రీరామ్ ఆదిత్య కూడా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దాదాపు నిలబెట్టుకున్నాడు. మంచి కామెడీ సీన్స్.. బోర్ కొట్టకుండా వెళ్లిపోయే స్క్రీన్ ప్లే హీరో సినిమాలో ఉన్నాయి. గల్లా అశోక్ మొదటి సినిమా అయినా కూడా బాగానే నటించాడు. ఎలాంటి బెరుకు, భయం లేకుండా స్క్రీన్ మీద కనిపించాడు. డాన్సులు బాగానే చేశాడు. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ కుర్రాడిలో కనిపించాయి. సినిమా కూడా ముక్కలు ముక్కలుగా చూస్తే బాగానే ఉంటుంది. అయినా కూడా మొదటి రోజు కనీసం నామమాత్రపు వసూళ్లు రాలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 23 శాతం ఓపెనింగ్ మాత్రమే వచ్చింది. అంటే కలెక్షన్స్ కేవలం లక్షల్లో మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఈ సినిమా కోసం 10 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. డబ్బులు వెనక్కి వచ్చినా రాకపోయినా.. గల్లా అశోక్ హీరోగా నిలబడితే చాలు.. కావలసిన గుర్తింపు వస్తే చాలు అనేది నిర్మాతల ప్లానింగ్. ఇప్పుడు అది కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఒకవైపు బంగార్రాజు థియేటర్లలో వీరంగం చేస్తున్నాడు. మరోవైపు 45 రోజుల తర్వాత కూడా అఖండ అద్భుతం చూస్తున్నాడు. ఇద్దరు సీనియర్ హీరోల మధ్య నాని శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా ఉనికి చాటుకుంటుంది. అందుకే పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హీరో సినిమాకు కలెక్షన్స్ రావడం లేదు. ప్రమోషన్స్ ఆగకుండా చేస్తున్నారు చిత్ర యూనిట్. మరి ఇది ఎంతవరకు సినిమాకు కలిసి వస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన మలయాళ నటి.. అసలు నిజం ఇది..
Bangarraju Review | ‘బంగార్రాజు’ రివ్యూ
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘ఆచార్య’ విడుదల తేదీ ప్రకటన..
భీమ్లా నాయక్ రిలీజ్‌పై మరోసారి క్లారిటీ.. అదిరిపోయిన నయా పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

