Rajasekhar about mohanbabu | జగపతి బాబు, అర్జున్, వేణు తొట్టెంపూడి హీరోలుగా 20 ఏండ్ల కింద వచ్చిన చిత్రం హనుమాన్ జంక్షన్ ( Hanuman junction ). ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమా అప్పట్లో కడుపుబ్బా నవ్వించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సీన్లు చూస్తే నవ్వు రావడం పక్కా. అంతలా ప్రేక్షకులకు దగ్గరైంది కాబట్టే ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోలుగా ముందు అనుకున్నది జగపతి బాబు, అర్జున్ను కాదంట. రాజశేఖర్, మోహన్ బాబుతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట దర్శకుడు. సినిమా స్టోరీ రాజశేఖర్‌కు చెప్తే ఓకే కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుని అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశాడు. ఈ విషయంపై తాజాగా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.
హనుమాన్ జంక్షన్ సినిమా ఒప్పుకున్నప్పుడు అందులో మోహన్ బాబు కూడా ఉన్నాడని రాజశేఖర్‌కు తెలియదంట. మోహన్ బాబు కూడా ఉన్నాడని తెలియగానే సినిమా నుంచి తప్పుకున్నాడట. అప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశాడంట. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో రాజశేఖర్ వివరణ ఇచ్చాడు. షూటింగ్ 9 గంటలకు ఉందంటే.. నేను పది గంటల వరకు వెళ్తాను.. కానీ మోహన్ బాబు అలా కాదు. కచ్చితంగా టైమ్ పాటిస్తాడు. కానీ నాకు ఆ క్రమశిక్షణ లేదని చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో సినిమా పూర్తయ్యేసరికి గొడవలు వస్తాయి.. దీంతో మా రిలేషన్ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే సినిమా నుంచి తప్పుకున్నట్టు చెప్పాడు. ఇక రాజశేఖర్ తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్‌పై మోహన్‌బాబు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆయన కూడా సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ చేతులు మారి ఫైనల్‌గా జగపతి బాబు, అర్జున్ దగ్గరికి వెళ్లింది. సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ , పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
రాజశేఖర్ కూతుళ్ళు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా..?
సంకాంత్రి సంబరాల్లో గుర్రం ఎక్కి సందడి చేసిన బాలకృష్ణ..
Acharya | ‘ఆచార్య’ మూవీ విడుదల వాయిదా.. కొణిదెల ప్రొడక్షన్స్ ట్వీట్
వాళ్లిద్దరూ నా వల్ల విడిపోలేదు.. షణ్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి
మోహన్ బాబు రాసిన లేఖ ఎవరిని ఉద్దేశించనది?