Acharya Movie | మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ నటిస్తున్న ఆచార్య మూవీ విడుదల వాయిదా పడింది. ఆచార్య సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ మూవీ విడుదల కావాల్సి ఉండే. కానీ కరోనా ఉధృతి దృష్ట్యా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. త్వరలోనే ఆచార్య విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కొణిదెల ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు.