వాళ్లిద్దరూ నా వల్ల విడిపోలేదు.. షణ్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి

Siri Open about shanmukh and deepthi sunaina break up | బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు సీజన్ నడుస్తుండగానే అందరికీ అనిపించింది ఒక్కటే. సీజన్ అయిపోగానే కచ్చితంగా షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయిన మధ్య పెద్ద గొడవలే జరుగుతాయని అనుకున్నారు. కానీ అంతకుమించే జరిగింది. కొత్త సంవత్సరం రోజే షణ్ముఖ్‌కు షాకిస్తూ దీప్తి సునయిన బ్రేకప్ చెప్పింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్‌గా లేఖ పోస్టు చేసింది. అయితే వీరిద్దరు విడిపోయింది మొదలు దీనికి కారణం సిరినే అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. వీటిపై తాజాగా సిరి హన్మంత్ స్పందించింది.
దీప్తి సునయిన, షణ్ముఖ్ విడిపోవడానికి నేనే కారణమంటూ ట్రోల్స్ రావడంతో డిప్రెషన్‌కు గురయ్యానని సిరి హన్మంత్ బాధపడింది. వారిద్దరూ విడిపోవడానికి తాను కారణం కాదని పేర్కొంది. బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజుల ప్రయాణంలో కంటెస్టెంట్స్ మధ్య ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అయితే షణ్నూకి, నాకు మధ్య ఆ ఎమోషన్స్ ఎక్కువయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్, జెస్సీ నాకు మంచి ఫ్రెండ్స్. రవి ఒక బ్రదర్‌లా ఉన్నాడు. షణ్నూ నాకు మంచి స్నేహితుడు. దీప్తి కూడా నాకు ఫ్రెండే. వారిద్దరితోనూ నేను కలిసి వర్క్ చేశాను. కానీ వారిద్దరూ నా వల్లే విడిపోయారని అనడం కరెక్ట్ కాదు. వాళ్లది కేవలం వంద రోజుల్లోనే విడిపోయేంత వీక్ ప్రేమ అని అనుకోవడం లేదు. అని సిరి చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ , పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
షణ్ముఖ్ బాటలోనే సిరి కూడా.. బ్రేకప్ దిశగా అడుగులు..
దీపూ నుంచి చివరగా కోరుకునేది అదొక్కటే.. బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్
Acharya | ‘ఆచార్య’ మూవీ విడుదల వాయిదా.. కొణిదెల ప్రొడక్షన్స్ ట్వీట్
గని నుంచి సంక్రాంతి సర్ప్రైజ్.. తమన్నా స్పెషల్ సాంగ్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

