Siri Hanmanth | బిగ్ బాస్ 5 తెలుగు తర్వాత కూడా షణ్ముఖ్ జస్వంత్ ( shanmukh jaswanth ) సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన ప్రేయసి దీప్తి సునయన ( deepthi sunaina )తో విడిపోవడమే. నిజం చెప్పాలంటే అక్కడ సీజన్ జరుగుతున్నప్పుడే.. బయటకు వచ్చిన తర్వాత మనోడికి కచ్చితంగా ఏదో ఒక షాక్ తగులుతుంది అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌కు షాక్ ఇచ్చింది దీప్తి సునయిన. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం సిరి అని సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సిరి రిలేషన్ కూడా డేంజర్ జోన్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
సిరి ప్రియుడు శ్రీహాన్ ( Srihan ) సైతం బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య రిలేషన్ అంత బాగా లేదని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. అంతేకాదు తన సోషల్ మీడియా పేజీలో సిరి ఫోటోలను వరుసగా శ్రీహాన్ డిలీట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్ విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమె ప్రియుడికి ససేమిరా నచ్చలేదు అని తెలుస్తోంది. ముఖ్యంగా బయట తను రిలేషన్లో ఉన్న విషయం తెలిసి కూడా పదే పదే షణ్నూతో ఎమోషనల్‌గా తాను కనెక్ట్ అవుతున్నాను అని చెప్పడం శ్రీహాన్‌కు నచ్చట్లేదు అని ప్రచారం జరుగుతుంది.
అందుకే ఈ జంట కూడా విడిపోయే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సిరి కూడా మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తన సోషల్ మీడియా పేజీలో కొన్ని ఇన్స్పిరేషనల్ పోస్టులు పెడుతుంది. ఏదేమైనా కూడా బిగ్ బాస్ కారణంగా ఇప్పటి వరకు ఎవరి పర్సనల్ లైఫ్ కూడా ఇంతగా డిస్టర్బ్ కాలేదు. గత నాలుగు సీజన్స్ అన్నీ ప్రశాంతంగా జరిగాయి. కానీ మొదటిసారి ఐదో సీజన్ కారణంగా రెండు జంటల మధ్య లేనిపోని చిచ్చు రాజుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa in OTT | RRR డేట్‌ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే
న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
దీపూ నుంచి చివరగా కోరుకునేది అదొక్కటే.. బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్
ఆ విషయంలో సిరిని ఏమైనా అంటే బాగోదు.. యాంకర్ రవి కామెంట్స్..