న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
Deepthi sunaina announced break up with shanmukh jaswanth | కొద్దిరోజులుగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి ! యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునయిన విడిపోయింది. తమ ఐదేళ్ల ప్రేమబంధానికి పుల్‌స్టాప్ పెడుతున్నామని ప్రకటించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే షణ్నూకి బ్రేకప్ చెప్పి.. అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో దీప్తి సునయిన సుదీర్ఘ పోస్టు పెట్టింది.

శ్రేయోభిలాషులు, స్నేహితులందరికీ ఒక విషయం చెప్పాలి. నేను, షణ్ముఖ్ ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లలో మేమిద్దరం ఎంతో సంతోషంగా గడిపాం. ఆ సమయంలోనే మాలోని రాక్షసులతో పోరాడాం. చివరకు మీరందరూ కోరుకున్నట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై చాలాకాలంగానే అనుకుంటున్నాం. కానీ సోషల్ మీడియాలో కనిపించినంత సులువేం కాదు. ఇద్దరం కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించాం. ఈ క్రమంలో మా లైఫ్‌లో ఏది అయితే అవసరమో దాన్నే విస్మరించాం. చివరకు మా దారులు వేరని అర్థం చేసుకున్నాం. అందుకే ఇక్కడితో ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించాం. ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఇది మాకు ఎంతో క్లిష్టమైన సమయం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా ప్రైవసీకి భంగం కలిగించారని ఆశిస్తున్నాం అంటూ దీప్తి సునయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా కామెంట్ సెక్షన్‌ను కూడా ఆఫ్ చేసింది. ఏదేమైనా న్యూఇయర్ రోజున దీప్తి సునయిన తన బ్రేకప్ విషయాన్ని ప్రకటించడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. కొత్త సంవత్సరంలో కలిసి పోతారని అనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్, డబ్స్మాష్ వీడియోల ద్వారా దీప్తి, షణ్ముఖ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ డ్యాన్స్‌పై ఇష్టం ఉండటంతో తొందరగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది ప్రేమగా మారింది. కానీ షణ్ముఖ్ బిగ్‌బాస్ షోకు వచ్చిన తర్వాత సిరితో బాగా కనెక్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, షణ్నూ ప్రవర్తన, ఇద్దరి హగ్గులు, ముద్దులపై సోషల్‌మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే దీప్తి సునయినతో షణ్నూకు చెడింది. దీంతో వీరిద్దరూ విడిపోయినట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో స్పందించిన షణ్ముఖ్.. దీప్తి సునయిన తనపై అలిగిందని.. అందుకే బ్లాక్ చేసిందని చెప్పాడు. త్వరలోనే కలుస్తామని చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలిసిపోతారని ఆశించిన ఫ్యాన్స్‌కు దీప్తి సునయిన షాకిచ్చింది. షణ్ముఖ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Deepthi: బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Deepthi Sunaina : చీర కట్టులో దీప్తి సునైనా… అందాలతో మత్తెక్కిస్తోందిగా
Shanmukh: రూ.25 లక్షలు తన ప్రేయసికి ఇస్తానని చెప్పిన షణ్ముఖ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

