సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఒకరు. వీరిద్దరు యూట్యూబ్ వీడియోలతో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. ఈ ఇద్దరూ ప్రేమ మైకంలో విహరిస్తున్నారని ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం ఎక్కడా రియాక్ట్ కాలేదు. అయితే చివరకు బిగ్ బాస్ ఐదో సీజన్లో షణ్ముఖ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో దీప్తి సునయన ఓపెన్ అయింది.
టీవీలో తన షణ్ముఖ్ ఎంట్రీని చూసి ఎంతో ఆనందంతో ఐ లవ్ యూ చెప్పేసింది. ఇక అంతటితో ఆగక గురువారం రోజు షణ్ముఖ్ బర్త్ డే కావడంతో స్పెషల్ బైట్ పంపింది.ఇందులో తన ప్రేమనంతా తెలియజేస్తూ ఐ లవ్ యూ చెప్పింది. షణ్ముఖ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. షణ్ముఖ్ బర్త్ డే వేడుకలని దీప్తి బయట ఘనంగా జరిపింది. అంతేకాదు అతనితో క్లోజ్‌గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఐ లవ్ యూ అని చెప్పింది.
ఈ క్రమంలో ఇన్నాళ్లు అందరిలోఉన్న సస్పెన్స్‌కి తెర పడింది.ఇక బిగ్ బాస్ హౌజ్‌లో కూడా షణ్ముఖ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. వాళ్ల పేరెంట్స్ విషెస్ తెలిపిన వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. అనంతరం ప్రేయసి దీప్తి సునయన ఐ లవ్యూ చెప్పిన వీడియో ప్లే చేయడంతో అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి.