Malaika Arora | డేటింగ్ రూమర్స్.. వాటిపై తన కొడుకు స్పందన ఏంటో చెప్పిన మలైకా
Malaika Arora | బాలీవుడ్ నటి మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లపై తాజాగా స్పందించారు. ‘కర్లీ టేల్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలపై ఓపెన్‌గా మాట్లాడారు. మొదట్లో ఇలాంటి గాసిప్స్ తనను బాధపెట్టేవని, కానీ ఇప్పుడు వాటిని జోక్‌లా తీసుకుంటున్నానని వెల్లడించారు.
Malaika Arora | బాలీవుడ్ నటి మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లపై తాజాగా స్పందించారు. ‘కర్లీ టేల్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలపై ఓపెన్‌గా మాట్లాడారు. మొదట్లో ఇలాంటి గాసిప్స్ తనను బాధపెట్టేవని, కానీ ఇప్పుడు వాటిని జోక్‌లా తీసుకుంటున్నానని వెల్లడించారు. మొదట్లో ఈ రూమర్లు నన్ను ఇబ్బంది పెట్టేవి. కానీ ఇప్పుడు నేను, నా కొడుకు అర్హాన్ ఖాన్ కలిసి వాటిని చూసి నవ్వుకుంటాం అని మలైకా తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి వార్తలు తనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల పరిస్థితి ఎలా తయారైందంటే, తాను ఎవరితో కనిపించినా వెంటనే అఫైర్ అంటూ ప్రచారం జరుగుతోందని మలైకా వాపోయారు. స్నేహితులు, పెళ్లైన సహనటులు, అంతేకాకుండా తన మేనేజర్‌తో కూడా తన పేరును అనవసరంగా ముడిపెడుతున్నారని ఆమె తెలిపారు.
ఇటీవల ‘స్ప్లిట్స్‌విల్లా X6’ ఫేమ్ సోరబ్ బేడీతో కలిసి మలైకా పార్టీ చేసుకుంటూ కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మళ్లీ ఊహాగానాలు మొదలుపెట్టారు. దీనికి ముందు కూడా ఆమె పేరును ఓ “మిస్టరీ మ్యాన్”తో కలిపి ప్రచారం జరిగింది. తన జీవితంపై మాట్లాడిన అరోరా, ఒక తోడు ఉండటం మంచిదేనని అంగీకరించింది. కానీ ప్రత్యేకంగా ఎవరిని వెతకడం లేదన్నారు. జీవితంలో కొన్ని విషయాలు ప్లాన్ చేయలేం. జరగాల్సింది అదే జరుగుతుంది. ప్రస్తుతం నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్నాను” అని చెప్పారు. నేను సెల్ఫ్-మేడ్ మహిళను. నేను ఎవరితోనైనా ఉండాలనుకుంటే, అది నా నిర్ణయం ప్రకారం మాత్రమే ఉంటుంది అని ఆమె ధైర్యంగా చెప్పారు.
కాగా, మలైకాకు 2017లో అర్బాజ్ ఖాన్‌తో విడాకులు అయ్యాయి. అనంతరం అర్జున్ కపూర్‌తో రిలేషన్షిప్లో ఉంది. ఆ సమయంలో ఇద్దరు తెగ చెట్టపట్టాలు వేసారు.అది కూడా తరువాత ముగిసింది. మరి నెక్ట్స్ ఎవరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైన తనపై వచ్చే రూమర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, తన జీవితాన్ని తన షరతుల ప్రకారం నడిపిస్తున్న మలైకా అరోరా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

