Slow Travel | హడావుడి టూర్స్‌కు గుడ్‌బై.. స్లో ట్రావెల్పైనే Gen-Z క్రేజ్!
Slow Travel | ఉరుకులు పరుగుల జీవితంలో.. ఊపిరి సలపని పనులతో బతికేస్తున్నారు. ప్రశాంతత కోసమని విహారయాత్రకు వెళ్లినా.. ఎక్కడా పట్టుమని పది నిమిషాలు ఉండలేకపోతున్నారు. ఒకే టూర్లో నాలుగైదు ప్రాంతాలను ఎంచుకొని.. చకచకా చుట్టేస్తున్నారు.
Slow Travel | ఉరుకులు పరుగుల జీవితంలో.. ఊపిరి సలపని పనులతో బతికేస్తున్నారు. ప్రశాంతత కోసమని విహారయాత్రకు వెళ్లినా.. ఎక్కడా పట్టుమని పది నిమిషాలు ఉండలేకపోతున్నారు. ఒకే టూర్లో నాలుగైదు ప్రాంతాలను ఎంచుకొని.. చకచకా చుట్టేస్తున్నారు. అయితే, పర్యాటకం అంటే కేవలం ఫొటోలు దిగిరావడమే కాదని.. జెన్-జీ ట్రావెలర్లు అంటున్నారు. ‘సందర్శనకు వెళ్లిన ప్రాంతాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడం’ అని చెబుతున్నారు. ఇందుకోసం.. ‘స్లో ట్రావెల్’ చేయాలని సలహా ఇస్తున్నారు.
‘స్లో ట్రావెల్’… జెన్ జెడ్ ఎక్కువగా ఫాలో అవుతున్న ట్రెండ్. వాళ్ల అభిప్రాయంలో.. ఇలా నెమ్మదిగా ప్రయాణించడం అనేది ఒక టూర్ కాదు. అదొక ఫిలాసఫీ! స్థలాలను వీక్షించడానికి బదులుగా.. ఆయా ప్రాంతాల అనుభూతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పదిరోజుల్లో పదిహేను సందర్శనా స్థలాలు చుట్టేయకుండా.. ఒకే పర్యాటక కేంద్రంలో వారం రోజులు ఉండిపోతున్నారు. అక్కడి సంస్కృతిని ఆస్వాదిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలతోపాటు స్థానిక ప్రజల జీవన విధానాలనూ తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పర్యావరణ స్పృహతోనూ మెదులుతున్నారు. విమానాలు, సొంత వాహనాలకు బదులుగా.. రైళ్లు, కొందరైతే నడకతోనూ ప్రయాణించి పర్యావరణానికి మేలు చేస్తున్నారు.
ఎందుకీ ట్రెండ్?
‘స్లో ట్రావెలింగ్’తో అనేక లాభాలు ఉన్నాయని ట్రావెలింగ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ప్రయాణ సమయంలో ఉండే ఒత్తిడి..
ఈ స్లో ట్రావెలింగ్‌లో ఉండదు. రైలు, ఫ్లయిట్ మిస్ అవుతుందనే టెన్షన్ అక్కర్లేదు. ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు. ఇక ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఒకేచోట ఎక్కువ రోజులు ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి. హోటల్స్‌కు బదులుగా.. హోమ్‌స్టేలను ఎంచుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది. సందర్శించిన ప్రాంతంతో గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. అక్కడి భాష, ఆహారం, ఆచారాలను లోతుగా అర్థం చేసుకోవచ్చు. స్థానిక వ్యాపారులకూ ఆర్థికంగా తోడ్పడవచ్చు.
ఎలా వెళ్లాలి?
స్లో ట్రావెలింగ్ చేయడానికి కొన్ని టిప్స్ కూడా అందిస్తున్నారు.
- ట్రిప్ ప్లాన్‌లో ఒకటి లేదా రెండు ప్రాంతాలే ఉండాలి. ఇక అక్కడ చూడాల్సిన ప్రాంతాలు, చేయాల్సిన పనులు కూడా తగ్గించుకోవాలి. మిగిలిన సమయాన్ని ఆ ప్రదేశంలో తిరగడానికే కేటాయించాలి.
- బస కోసం స్టార్ హోటల్స్‌కు బదులుగా.. స్థానికుల ఇళ్లలో హోమ్‌స్టేలుగా ఉండాలి. దీనివల్ల స్థానిక జీవనశైలిపై అవగాహన వస్తుంది.
- మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ లాంటి అంతర్జాతీయ ఫుడ్ చెయిన్స్ కాకుండా.. స్థానికంగా ఉన్న చిన్నచిన్న హోటల్స్‌లో భోజనం చేయాలి. అప్పుడే లోకల్ ఫ్లేవర్స్ రుచి తెలుస్తుంది.
- ట్యాక్సీలకు బదులుగా.. లోకల్ బస్సులు, సైకిల్స్ ఉపయోగించాలి.
- స్థానిక భాషలో బేసిక్స్ నేర్చుకోవాలి. నమస్కారం, ధన్యవాదాలు లాంటి చిన్న పదాలైనా స్థానిక భాషలో మాట్లాడటానికి ప్రయత్నించాలి. దీనివల్ల స్థానికులతో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

