Monalisa | మోనాలిసా భోంస్లే పెళ్లి వివాదం.. ఆరోపణలు ఖండించిన దర్శకుడు సనోజ్ మిశ్రా
Monalisa | ఇటీవల ప్రేమ వివాహంతో వార్తల్లో నిలిచిన మోనాలిసా భోంస్లే పేరు ఇప్పుడు మరో వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి, పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్న ఆమె నిర్ణయంపై బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
Monalisa | ఇటీవల ప్రేమ వివాహంతో వార్తల్లో నిలిచిన మోనాలిసా భోంస్లే పేరు ఇప్పుడు మరో వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి, పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్న ఆమె నిర్ణయంపై బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మోనాలిసాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిన సనోజ్ మిశ్రా, ఈ వివాహం చెల్లదని వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో కేరళలో జరిగిన విలేకరుల సమావేశంలో మోనాలిసా సంచలన ఆరోపణలు చేశారు. సినిమా షూటింగ్ పేరుతో తనపై సనోజ్ మిశ్రా అసభ్యంగా ప్రవర్తించాడని, తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు.
ఇంతకుముందే ఈ విషయాన్ని తన కుటుంబానికి చెప్పినప్పటికీ, తొలి సినిమా అవకాశం కావడంతో నిశ్శబ్దంగా ఉండాలని సూచించారని మోనాలిసా తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమె నటించాల్సిన ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆరోపణలపై స్పందించిన సనోజ్ మిశ్రా, మోనాలిసా చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. “ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికీ నా ఇంట్లోనే ఉంటున్నారు. నేను ఆమె వివాహం చెల్లదు అని చెప్పినందుకే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు. నేను ఆమెకు నటన, డైలాగ్స్ అన్నీ నేర్పుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. ఒకవేళ నిజంగా ఇలాంటి ఘటన జరిగి ఉంటే, అప్పుడే ఫిర్యాదు చేసేవారు అని ఆయన అన్నారు.
అలాగే, తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. నిజం బయటపడేందుకు నేను కోర్టును ఆశ్రయిస్తాను అని తెలిపారు. ఈ వివాదం కారణంగా సినిమా ప్రాజెక్ట్ కూడా నిలిచిపోవడంతో ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మోనాలిసా ఆరోపణలు, సనోజ్ మిశ్రా కౌంటర్ వ్యాఖ్యలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటంతో అసలు నిజం ఏమిటన్నదానిపై ఆసక్తి పెరిగింది.ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో, చట్టపరంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

