Pushpa in OTT | RRR డేట్‌ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే

Pushpa in OTT | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఎవరూ ఊహించని విధంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా థియేటర్స్‌లో అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తున్న సమయంలోనే ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. సినిమా విడుదలైన నాలుగు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.
థియేటర్స్‌లో ఇప్పటికీ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నది. ముఖ్యంగా పుష్ప సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్లో 60 కోట్ల మార్కు అందుకుంది. 75 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఇలాంటి సమయంలో నాలుగు వారాలకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం 50 రోజుల గ్యాప్ ఉంటుంది. అయితే సినిమాను అమ్మేటప్పుడు నిర్మాతలు చేసుకునే ఒప్పందాన్ని బట్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మూడు నుంచి నాలుగు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాయి. ఇప్పుడు పుష్ప సినిమాకు కూడా అలాగే నాలుగు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 7న సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రకటించింది. హిందీ మినహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
He’ll fight. He’ll run. He’ll jump. But he won’t succumb! 💥
— prime video IN (@PrimeVideoIN) January 5, 2022
Watch #PushpaOnPrime, Jan. 7
In Telugu, Tamil, Malayalam and Kannada@alluarjun #FahadhFaasil @iamRashmika@Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi pic.twitter.com/lVxoE7DJSs
నిజానికి పుష్ప సినిమా ఓటీటీలో వస్తున్న జనవరి 7న ట్రిపుల్ ఆర్ సినిమా రావాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా ట్రిపుల్ ఆర్ సినిమాను తీసుకురావాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం వల్ల కఠిన ఆంక్షలు తీసుకురావడం.. ముంబై, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడుపుకోవాలని ఆదేశించారు. దీంతో ఇలాంటి క్లిష్ట సమయంలోనే ట్రిపుల్ ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తీసుకొస్తే నష్టపోతామని భావించిన నిర్మాతలు సినిమాను వాయిదా వేశారు. దీంతో ట్రిపుల్ ఆర్ చూద్దామని ఎంతగానో ఎదురుచూసిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ వారిని సర్ప్రైజ్ చేస్తూ అదే రోజున పుష్ప సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
అప్పుడూ.. ఇప్పుడూ కరోనా నుంచి తప్పించుకున్న అదృష్టవంతులు వీళ్లే..
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
Sukumar | తెలుగు ప్రేక్షకుల కోసం సుకుమార్ ‘పుష్ప’లో ఆ సీన్ పెట్టలేదట..!
పుష్ప 2 విషయంలో సుకుమార్‌కు డెడ్‌లైన్ పెట్టిన అల్లు అర్జున్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

