Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
Pushpa Deleted Scene | క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా విడుదలైన పుష్ప సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Pushpa Deleted Scene | అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమాను చూశారా? క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా విడుదలైన పుష్ప సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు.

తాజాగా పుష్ప సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీన్‌ను మూవీ యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సీన్ సినిమాలో లేదు. దీంతో ఆ సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. పుష్ఫ తల్లి భారతమ్మ ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటుంది. ఆ అప్పు తీర్చకపోయేసరికి ఆమెను ఊరి వాళ్ల ముందు అవమానిస్తాడు రెడ్డప్ప. ఆ మాటలు విన్న పుష్ప.. తెల్లారి అప్పు డబ్బులు మొత్తం రెడ్డప్పకు చెల్లిస్తాడు.
దీంతో లెక్క సరిపోయింది పుష్ఫ అంటాడు రెడ్డప్ప. నీ లెక్క సరిపోయింది సరే.. మరి నా లెక్క అంటాడు పుష్ప. మేము అప్పు తీసుకున్నామని ఊరంతా తెలిసేలా చేశావు. ఇప్పుడు అప్పు తీర్చామని ఊరంతా తెలవద్దా.. అంటూ అతడిని కొట్టుకుంటూ తీసుకెళ్లి ఊరందరికీ పుష్ప అప్పు తీర్చాడు అని చెప్పిస్తాడు పుష్ప.
ఈ సీన్‌ను ఎందుకు తీసేశారో స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం వల్లనే ఈ సీన్‌ను తీసేసి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

