పుష్ప 2 విషయంలో సుకుమార్‌కు డెడ్‌లైన్ పెట్టిన అల్లు అర్జున్..

Pushpa 2 | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. కానీ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తో కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. 10 రోజుల్లో దాదాపు 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ స్టేటస్ అందుకోలేకపోయిన పుష్ప.. మిగిలిన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ముఖ్యంగా హిందీ, తమిళంలో ఇప్పటికే చేసిన బిజినెస్ కంటే ఎక్కువ వసూలు చేసింది ఈ సినిమా. తెలుగులో మాత్రం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉంటే పుష్ప రెండో భాగం కోసం దర్శకుడు సుకుమార్‌కు అల్లు అర్జున్ ఒక డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను కేవలం 100 రోజుల్లో పూర్తి చేయాలని సుకుమార్‌కు అల్లు అర్జున్ చెప్పాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించి కూడా కొంత భాగం షూటింగ్ అయిపోయింది. దాంతో మిగిలిన భాగం షూటింగ్ కూడా వంద రోజుల్లో పూర్తి చేయాలని సుకుమార్ ను కోరుతున్నాడు అల్లు అర్జున్. అంతేకాదు మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని సెకండ్ పార్ట్‌లో మదర్ సెంటిమెంట్ తగ్గించి.. అల్లు అర్జున్, రష్మిక మధ్య ట్రాక్ మరింత పెంచుతున్నారని తెలుస్తోంది. పుష్ప ది రూల్‌లో అల్లు అర్జున్ ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా ఫ్యూచర్ డిసైడ్ చేయనున్నాయి. అందుకే దీని గురించి సుకుమార్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. రెండో భాగంలో సునీల్, అనసూయ క్యారెక్టర్స్ కూడా కీలకం కాబోతున్నాయి. సినిమాలో కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి మే లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pushpa | ఆ సీన్లో అల్లు అర్జున్ న్యూడ్‌గా కనిపించాల్సింది.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- pushpa 2
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

