ఆ విషయంలో సిరిని ఏమైనా అంటే బాగోదు.. యాంకర్ రవి కామెంట్స్..

Anchor Ravi | బిగ్ బాస్ 5 తెలుగు ( Biggboss 5 Telugu ) పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అయితే సీజన్ 5 షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh jaswanth ) మాత్రం బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేయసి దీప్తి సునైనా ( deepthi sunaina ) జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా బ్రేకప్ చెప్పింది. ఇప్పటినుంచి ఎవరి బతుకు వాళ్లు బతుకుదామని సోషల్ మీడియాలో ఓపెన్‌గా ఒక లెటర్ రాసింది. దీనిపై స్పందించిన షణ్ముఖ్ జస్వంత్ నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే నువ్వు ఎంతో చేశావు.. ఇప్పటినుంచి నువ్వు హాయిగా ఉండు.. దానికి నువ్వు అర్హురాలు అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఇద్దరూ విడిపోవడానికి కారణం సిరి ( Siri Hanmanth ) అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్‌లో సిరి, షణ్ముఖ్ ఇద్దరూ చేసిన రచ్చకు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా హర్ట్ అయ్యారు. సిరి వాళ్ల అమ్మ వచ్చి సిరిని షణ్ముఖ్ జస్వంత్ కౌగిలించుకోవడం తనకు నచ్చలేదని చెప్పింది. వీళ్లిద్దరి రిలేషన్ బయటికి తప్పుడు దారిలోనే వెళ్లింది. అప్పటికి ఇంట్లో ఉన్న యాంకర్ రవి ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఒకసారి చెక్ చేసుకోండి.. మీ ఇద్దరి రిలేషన్ చూస్తుంటే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తున్నాయి అంటూ రవి చాలా సార్లు హెచ్చరించాడు. బిగ్‌బాస్ హౌజ్నుంచి బయటికి వచ్చిన తర్వాత అదే నిజమైంది. ఎవరూ ఊహించని విధంగా దీప్తి సునైనా, షణ్ముఖ్ విడిపోయారు. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోవడానికి సిరి కారణమని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. వీటిపై యాంకర్ రవి సీరియస్ అయ్యాడు. ఈ విషయంలో సిరిని ఎవరూ ఏమీ అనొద్దు అని అంటున్నాడు. షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ విషయంలో సిరిని బలిచేయడం కరెక్ట్ కాదని అంటున్నాడు. ఏదేమైనా బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
దీపూ నుంచి చివరగా కోరుకునేది అదొక్కటే.. బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్
Shanmukh: రూ.25 లక్షలు తన ప్రేయసికి ఇస్తానని చెప్పిన షణ్ముఖ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

