దీపూ నుంచి చివరగా కోరుకునేది అదొక్కటే.. బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్

Shanmukh jaswanth reaction on break up with deepthi sunaina | బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ రన్నర్ షణ్ముఖ్ జస్వంత్‌కు అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పింది. కొత్త సంవత్సరం రోజే అందరికీ షాకిస్తూ.. ఐదేళ్ల తమ ప్రేమబంధాన్ని తెగదెంపులు చేసుకుంది. ఈ మేరకు తమ బ్రేకప్ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది దీప్తి సునయిన. ఈ క్రమంలోనే బ్రేకప్‌పై స్పందించాడు షణ్ముఖ్. తన బాధను చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్టు చేశాడు.
ఈ నిర్ణయం తీసుకునేందుకు ఆమెకు హక్కుంది. ఇప్పటివరకు ఆమె చాలా ఎదుర్కొంది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి. చివరగా నేను కోరుకునేది అదొక్కటే. మా దారులు వేరైనప్పటికీ ఒకరికి ఒకరం అండగా ఉంటాం. గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు ఈ ఐదేళ్లు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ దీపూ అని షణ్ముఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

అంతకుముందు తమ బ్రేకప్ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ లేఖ పోస్టు చేసింది దీప్తి సునయిన. అందులో.. శ్రేయోభిలాషులు, స్నేహితులందరికీ ఒక విషయం చెప్పాలి. నేను, షణ్ముఖ్ ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లలో మేమిద్దరం ఎంతో సంతోషంగా గడిపాం. ఆ సమయంలోనే మాలోని రాక్షసులతో పోరాడాం. చివరకు మీరందరూ కోరుకున్నట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై చాలాకాలంగానే అనుకుంటున్నాం. కానీ సోషల్ మీడియాలో కనిపించినంత సులువేం కాదు. ఇద్దరం కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించాం. ఈ క్రమంలో మా లైఫ్‌లో ఏది అయితే అవసరమో దాన్నే విస్మరించాం. చివరకు మా దారులు వేరని అర్థం చేసుకున్నాం. అందుకే ఇక్కడితో ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించాం. ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఇది మాకు ఎంతో క్లిష్టమైన సమయం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా ప్రైవసీకి భంగం కలిగించారని ఆశిస్తున్నాం అంటూ దీప్తి సునయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. మొత్తానికి ఇప్పుడు దీప్తి సునయిన, షణ్ముఖ్ బ్రేకప్ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR | ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ వాయిదా.. కన్ఫార్మ్ చేసిన నిర్మాతలు
న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
Deepthi: బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Deepthi Sunaina : చీర కట్టులో దీప్తి సునైనా… అందాలతో మత్తెక్కిస్తోందిగా
Shanmukh: రూ.25 లక్షలు తన ప్రేయసికి ఇస్తానని చెప్పిన షణ్ముఖ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

