RRR movie postponed | తెలుగు ఇండస్ట్రీనే కాదు దేశమంతటా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. బాహుబలి సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రం కావడంతో ట్రిపుల్ ఆర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల పరిస్థితులు అన్నీ చక్కబడటంతో ట్రిపుల్ ఆర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేయాలని జక్కన్న ఫిక్స్ అయ్యాడు. కానీ మళ్లీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఈ సినిమా మళ్లీ వాయిదా పడక తప్పలేదు. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు తాజాగా కన్ఫార్మ్ చేశాడు.
Keeping the best interests of all the involved parties in mind, we are forced to postpone our film. Our sincere thanks to all the fans and audience for their unconditional love. #RRRPostponed #RRRMovie pic.twitter.com/JlYsgNwpUO
— RRR Movie (@RRRMovie) January 1, 2022
కరోనా కారణంగా చాలా కాలం థియేటర్లు మూతబడ్డాయి. ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ జనాలు రావడానికి అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ చతికిలబడ్డ థియేటర్లకు అఖండ సినిమా ఊపిరిపోసింది. మంచి సినిమా వస్తే జనాలు థియేటర్లకు వస్తారని ఈ సినిమా కలెక్షన్లు నిరూపించాయి. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమాతో థియేటర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిలబెట్టింది. దీంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఒక్కొక్కరుగా తమ సినిమాల రిలీజ్ డేట్లను అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ అంతలోనే మళ్లీ ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండటం కలవరం పుట్టిస్తోంది. మెల్లమెల్లగా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించారు. నైట్ కర్ఫ్యూతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ చేయాలని నిబంధన విధించారు. దీంతో డిసెంబర్ 31న విడుదల కావాల్సిన జెర్సీ రీమేక్ వాయిదా పడింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు కూడా వాయిదా పడుతాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ రాధే శ్యామ్ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని ప్రకటించింది. కానీ ట్రిపుల్ ఆర్ నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గారు. తమ సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR ప్రమోషన్స్ కోసమే అంత ఖర్చు పెడుతున్నారా..?
ram charan about chiru advice | నాన్న ఏం సలహా ఇచ్చాడో చెప్పిన రాంచరణ్
Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
Komuram Bheemudo song l సూర్యుడిలా రగిలే భీముడు