RRR Promotions | ట్రిపుల్ ఆర్ సినిమాపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల బడ్జెట్ పెట్టారు అంటే ఏ స్థాయి ప్రమోషన్ చేస్తే సినిమా వర్కవుట్ అవుతుందనేది చిత్ర యూనిట్‌కు బాగా తెలుసు. ఇప్పుడు అదే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. గత కొన్ని రోజులుగా క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉన్నారు ట్రిపుల్ ఆర్ మేకర్స్. మరో వైపు దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా తమ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కఠిన నిబంధనలు విధించడంతో పాటు.. థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీకి ఆంక్షలు విధించారు. దీంతో జెర్సీ సహా పలు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ కూడా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ తాము చెప్పిన సమయానికే సినిమాను రిలీజ్ చేస్తామని అంటున్నాడు రాజమౌళి. దానికితగ్గట్టుగానే ప్రమోషన్‌ను కూడా భారీగానే చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒక విమానం బుక్ చేసుకుని వెళ్తున్నారు చిత్ర యూనిట్. అలాగే అక్కడ జరిగే ఈవెంట్స్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్ కోసం నిర్మాతలు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కేవలం ప్రమోషన్ కోసమే అదనంగా రూ.40 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్ కోసమే అంత ఖర్చు పెడుతున్నారు అంటే సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీక్రెట్‌గా విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత రివీల్
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Ram Charan Co star | ఈ హీరో డ్యాన్స్ ను రాంచరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడట
Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్