గని నుంచి సంక్రాంతి సర్ప్రైజ్.. తమన్నా స్పెషల్ సాంగ్ రిలీజ్

Tamannah special song from Ghani | వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గత నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అయినప్పటికీ ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్భంగా మెగా అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. తమన్నా స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
రింగా రే రింగా రింగా.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో తమన్నా మరోసారి స్టెప్పులతో అదరగొట్టింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 18న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అప్పటివరకు కరోనా పరిస్థితులు చక్కబడితే సినిమా విడుదలవుతుంది. లేదంటే ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాల తరహాలో వాయిదా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గని సినిమాలో నదియా, ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లోనటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Acharya | ‘ఆచార్య’ మూవీ విడుదల వాయిదా.. కొణిదెల ప్రొడక్షన్స్ ట్వీట్
సంకాంత్రి సంబరాల్లో గుర్రం ఎక్కి సందడి చేసిన బాలకృష్ణ..
Priyanka Chopra | సోషల్ మీడియాలో నిక్ తొలగింపుపై ప్రియాంక ఇలా !
లిప్‌లాక్ సీన్లపై సోషల్‌మీడియాలో ట్రోల్స్.. స్పందించిన అనుపమ పరమేశ్వరన్
Nidhhi Agerwal | హరిహరవీరమల్లు స్టోరీ లైన్ రివీల్ చేసిన నిధి అగర్వాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

