లిప్‌లాక్ సీన్లపై సోషల్‌మీడియాలో ట్రోల్స్.. స్పందించిన అనుపమ పరమేశ్వరన్

Anupama lip lock in Rowdy boys | ప్రేమమ్ సినిమాతో అందర్నీ మెస్మరైజ్ చేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా వచ్చి ఐదేండ్లు పూర్తయింది. కానీ ఒక్కసారి కూడా హద్దు దాటలేదు ఈ మలయాళీ భామ. తనకంటూ కొన్ని కంచెలు పెట్టుకుని అందులోనే గ్లామర్ షో చేస్తూ వచ్చింది. కానీ తాజాగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో రూట్ మార్చేసింది అనుపమ పరమేశ్వరన్. కెరీర్లో మొదటిసారి లిప్‌లాక్ సీన్లలోనూ నటించింది. కానీ ఇది ఆమె ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. మీమ్స్ చేస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లిప్‌లాక్ సీన్లపై వివరణ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్.

దిల్ రాజు వారసుడు ( శిరీష్ కుమారుడు ) ఆశిష్ హీరోగా తెరకెక్కిన సినిమా రౌడీ బాయ్స్. ఇందులో అతనికి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. యంగ్ హీరో పక్కనే నటించడమే కాకుండా అతనితో లిప్ కిస్ సీన్లలోనూ రెచ్చిపోయింది. ఈ సినిమాలో దాదాపు ఐదు వరకు లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇన్నిరోజులుగా పద్ధతిగా చూసిన అనుపమ పరమేశ్వరన్‌ను అలా చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా? యంగ్ హీరోలతో ఇలాంటి సీన్లలో నటిస్తావా? డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతావా? అంటూ అనుపమపై సీరియస్ అయ్యారు. ఆమెపై మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై అనుపమ పరమేశ్వరన్ స్పందించింది.

ముద్దు సీన్లలో నటించడంపై వచ్చిన మీమ్స్‌ను చూసి ముందుగా అనుపమ పరమేశ్వరన్ నవ్వుకుంది. అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పింది. లిప్‌లాక్ సీన్లపై స్పందిస్తూ..అది సినిమాలో భాగం మాత్రమే.. ఆ సినిమాలో కేవలం హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు మాత్రమే ముద్దు పెట్టుకున్నాయని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఇకపై ఆశిష్‌ను టచ్ కూడా చేయనని క్లారిటీ ఇచ్చింది. ఆ సీన్లు ఎందుకున్నాయో సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని చెప్పింది. ఆ తర్వాత మీరే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని వివరణ ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..
చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్..
అనుపమతో చనువుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
సంక్రాంతి విజేత | హీరో వర్సెస్ రౌడీ బాయ్స్ గెలుపెవరిది?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

