By Maduri Mattaiah
Hero vs Rowdy boys | సంక్రాంతి పండగ అంటేనే సినిమా పండగ. సంక్రాంతికి కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండేవి.. కరోనా కారణంగా ఈసారి నిజంగానే సంక్రాంతి కళ తప్పింది. భారీ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌లు పోటీ నుంచి తప్పుకోవడంతో చివరిగా బంగ్రారాజు, హీరో, రౌడీబాయ్స్ సంక్రాంతి రేసులో ఉన్నాయి.
నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనాకు స్వీకెల్కు వస్తున్న బంగ్రారాజుపై అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమా రాబోతుంది. కాగా మిగిలిన రెండు సినిమాలు రౌడీబాయ్స్, హీరో చిత్రాలు యూత్‌ను టార్గెట్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాల నుంచి కూడా ఇద్దరు హీరోలు కూడా ఘనమైన సినీ నేపథ్యం ఉన్న వారే కావడం విశేషం. రౌడీబాయ్స్ చిత్రంతో దిల్‌రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. హుషారు ఫేమ్ హర్ష ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను చూస్తుంటే ప్రేమదేశం తరహాలో యూత్‌ఫుల్ లవ్‌ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అనుకుంటున్నారు.
హీరో చిత్రంతో రాబోతున్న మరో వారసుడు అశోక్ గల్లా. మహేశ్ బాబు మేనల్లుడుగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు ఈ యువ హీరో. పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ తనయుడిగా చాలా గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అశోక్. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. సినీ నేపథ్యంలో నడిచే కథతో రానున్న హీరో చిత్రంలో ఆసక్తికరమైన ట్విస్ట్‌లు ఉన్నాయని అంటున్నారు దర్శకుడు శ్రీరామ్. సో ఈ సంక్రాంతికి బంగ్రారాజుతో పోటీ పడుతున్న ఈ ఇద్దరి వారసుల్లో ఎవరు విజయాన్ని అందుకుంటారో వేచిచూడాలి.. !
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ప్రేమ దేశం సినిమాకు రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధం ఉందా?.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Keerthy Suresh |టాలీవుడ్‌ను వదలని కరోనా.. కీర్తి సురేశ్‌కు పాజిటివ్
మళ్లీ ప్రేమలో పడ్డ శ్రుతి హాసన్.. తానే ప్రపోజ్ చేశానంటూ ఓపెన్ అయిన నటి
చైతూను మామిడి తోటకు రమ్మంటున్న కృతిశెట్టి.. అదిరిపోయిన బంగార్రాజు టైలర్
దేశాలు దాటిన పుష్ప క్రేజ్..సామీ సామీ సాంగ్‌కు టాంజానియా వ్యక్తి అదిరిపోయే స్టెప్పులు