Shruti Haasan and santanu hazarika | కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ మరోసారి ప్రేమలో పడింది. ఇంగ్లండ్‌కు చెందిన సింగర్ మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన ఈమె.. చిత్రకారుడు శాంతను హాజరికాతో కొద్దిరోజులుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతి హాసనే కన్ఫార్మ్ చేసింది. కొంతకాలంగా శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన సోషల్‌మీడియాలో పోస్టు చేసుకుంటూ వస్తుంది శ్రుతి హాసన్. దీంతో ఆమె మరోసారి ప్రేమలో పడిందని.. శాంతనుతో రిలేషన్‌పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించే కపుల్స్ ఛాలెంజ్‌లో పాల్గొని తన శాంతనుతో ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. తానే ముందుగా శాంతనుకు ప్రపోజ్ చేశానని చెప్పుకొచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను రివీల్ చేసింది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కపుల్స్ ఛాలెంజ్‌లో తన ప్రియుడు శాంతనుతో కలిసి శ్రుతి హాసన్ పాల్గొంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. మీరిద్దరిలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారని అడిగిన ప్రశ్నకు నేనే.. అంటూ శ్రుతి సమాధానమిచ్చింది. ఇక ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రొటెక్టివ్ అని అడిగితే ఒకరినొకరు చూపించుకున్నారు. శ్రుతి హాసన్ శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని.. శాంతాను బాగా తింటాడని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రుతిహాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2017లో వచ్చిన కాటమరాయుడు సినిమా తర్వాత టాలీవుడ్‌కు దూరమైన శ్రుతి హాసన్.. గత ఏడాది క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాగానే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్తో మరో హిట్‌తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈమె ప్రభాస్‌తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్‌లో నటిస్తోంది. బాలకృష్ణ, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి కూడా హీరోయిన్గా ఎంపికైంది. ఇక చిరంజీవి సినిమాలోనూ శ్రుతి హాసణ్ ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శృతి హాసన్ జోరు.. బాలయ్య తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో ఆఫర్..
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
Shruti Haasan | మాస్ లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రుతి హాసన్..
చైతూను మామిడి తోటకు రమ్మంటున్న కృతిశెట్టి.. అదిరిపోయిన బంగార్రాజు టైలర్