టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
సినీ పరిశ్రమలో వారసుల టాపిక్ కొత్తేమి కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చిత్రపరిశ్రమల్లో సాధారణంగానే వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది.

సినీ పరిశ్రమలో వారసుల టాపిక్ కొత్తేమి కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చిత్రపరిశ్రమల్లో సాధారణంగానే వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది. అయితే హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వారసులను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు. ఇటీవల కాలంలో గమనించినట్లైతే మేం కూడా నటవారసులమే అంటూ సెలబ్రిటీల కూతుళ్లు కూడా తమ హవా చాటుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ సెలబ్రిటీలు తమ కూతుళ్లను రంగ ప్రవేశం చేయించగా..సక్సెస్ఫుల్ గా జర్నీ కొనసాగిస్తున్నారు. అయితే తెలుగులో వారసులను హీరోలుగా పరిచయడంతో పోలిస్తే..కూతుళ్లను హీరోయిన్లుగా చేయడంపై చాలా మంది సెలబ్రిటీలు అంతగా ఆసక్తి చూపలేదు. దీనిక్కారణం బాలీవుడ్ లో హీరోయిన్లకున్నంత స్వేచ్చ తెలుగులో ఉండకపోవడమనే చెప్పాలి.
కరీనాకపూర్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, జాన్వీకపూర్, సారా అలీఖాన్, అనన్యపాండే లాంటి హీరోయిన్లు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఇటీవల కాలంలో బాలీవుడ్ కు ఏమీ తక్కువ కాదన్న రేంజ్ లో వారసురాళ్లు తెరపైకి వస్తున్నారు. తెలుగులో మొదటగా వినిపించే పేరు కృష్ట కూతురు మంజుల. షో సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసినా..ఆ తర్వాత హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వర్రావు మనవరాలు సుప్రియ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో పవన్‌కల్యాణ్ కు జోడీగా నటించింది. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ అడివి శేష్ నటించిన గూఢచారి (2018) చిత్రంలో హీరోయిన్ గా కాకుండా కీ రోల్లో మెరిసిపోయింది.

ఆ తర్వాత మంచు మోహన్ బాబు కూతురు లక్ష్మీ అనగనగా ఓ ధీరుడు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా మెరిసింది. ఈ చిత్రానికి నంది అవార్డు కూడా అందుకుంది లక్ష్మీ ప్రసన్న. ఇదే సినిమాతో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఈ భామ తెలుగు, తమిళంలో ఇపుడు వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అభిమానులు, ఫాలోవర్ల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో మంచు లక్ష్మి యాక్టింగ్ ను కొనసాగిస్తుంది. ఇక మెగాఫ్యామిలీ నుంచి నాగబాబు కూతురు నిహారిక కూడా వెబ్‌సిరీస్, సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మరోవైపు రాజశేఖర్-జీవిత చిన్న కూతురు శివాత్మిక కూడా దొరసాని సినిమాతో అరంగేట్రం చేసింది. అలాగే పెద్ద కూతురు శివానిని కూడా సినిమాల విషయంలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు జీవితారాజశేఖర్ దంపతులు. వీరితోపాటు దివంగత సీనియర్ యాక్టర్ రాజేశ్ కూతురు ఐశ్వర్యా రాజేశ్ కూడా ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తోంది. మొత్తానికి సినీ పరిశ్రమలో వారసులంటే కొడుకులే కాదు..కూతుళ్లు కూడా అంటూ ఇప్పటివరకున్న హద్దులు చెరిపేసి..తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అందాల భామలు.

ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

