Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Road Accident | హైదరాబాద్ హయత్‌నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై థార్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన థార్ కారు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.
Road Accident | హైదరాబాద్ హయత్‌నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై థార్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన థార్ కారు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న రేఖ తన నాలుగేళ్ల కుమార్తెను తీసుకుని తన సోదరుడు నవీన్‌తో కలిసి పెద్ద అంబర్‌పేటలోని పుట్టింటికి బయల్దేరింది. బైక్‌పై బయల్దేరిన వారు హయత్‌నగర్‌కు చేరుకోగానే.. వేగంగా వచ్చిన థార్ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రేఖ, నవీన్ అక్కడికక్కడే మృతిచెందారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
బతుకమ్మ, దసరా పండుగల కోసం పుట్టింటికి వెళ్తుండగా ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారు.. ఓ పోలీసు అధికారికి చెందినదిగా గుర్తించారు.
థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం
హైదరాబాద్ హయాత్‌నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘటన
రేఖా తన నాలుగేళ్ల కుమార్తెతో పాటు సోదరుడు నవీన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. వేగంగా దూసుకొచ్చి వెనుక నుంచి ఢీకొట్టిన థార్
రేఖా, నవీన్ స్పాట్లోనే చనిపోగా.. నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించిన స్థానికులు
తోబుట్టువులు పండుగ కోసం ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట్‌లోని తమ ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం
ఈ ఘటన కారణంగా విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
ప్రమాదానికి కారణమైన థార్ కారు ఓ పోలీస్ అధికారికి చెందినదిగా గుర్తింపు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 18, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

