Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Prashant Kishor | బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్‌పై, జన సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు గుప్పించారు. ఆ రాష్ట్రంలోని పది మంది ఉత్తమ నాయకులలో ఆయన ఒకరని అన్నారు. బీహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో నితీశ్ కుమార్‌ను ప్రశాంత్ కిషోర్ పొగడటం ప్రాధాన్యత సంతరించుకున్నది.
పాట్నా: బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్‌పై, జన సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు గుప్పించారు. ఆ రాష్ట్రంలోని పది మంది ఉత్తమ నాయకులలో ఆయన ఒకరని అన్నారు. బీహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో నితీశ్ కుమార్‌ను ప్రశాంత్ కిషోర్ పొగడటం ప్రాధాన్యత సంతరించుకున్నది. (Prashant Kishor) వైశాలిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. బీహార్‌లోని అత్యంత వివేకవంతులైన నాయకులలో నితీశ్ కుమార్ ఒకరని తెలిపారు. సమాజం పట్ల ఆయనకు నిజమైన శ్రద్ధ ఉన్నదని, రాష్ట్ర చరిత్రలోని పది మంది ఉన్నత నాయకులలో ఆయన ఖచ్చితంగా ఒకరిగా నిలుస్తారని అన్నారు.
కాగా, నితీశ్ కుమార్ అనారోగ్యంతో ఉన్న కాలంలో, ఇతరులు ఆయన పేరు మీద ప్రభుత్వాన్ని నడిపినప్పుడు, ఆయన వ్యతిరేకించిన అనేక అవకతవకలు జరిగాయని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే నితీశ్ కుమార్ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బీహార్‌ను మెరుగుపరచడానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేశారని చెప్పారు.
మరోవైపు నితీశ్ కుమార్ కోసం 9 హత్యలు చేశానన్న జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంపైనా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అనంత్ సింగ్ ప్రకటనను తప్పుగా అన్వయించారని పేర్కొన్నారు. ‘నితీశ్ కుమార్ ఒక వివేకవంతుడైన నాయకుడు’ అంటూ ఆయనను సమర్థించారు. అదే సమయంలో బీజేపీకి చెందిన సీఎం సామ్రాట్ చౌదరిపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు.
అయితే పాట్నా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓటర్లు గత కొన్నేళ్లుగా నితీశ్ కుమార్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఓటర్ల లక్ష్యంగా నితీశ్ కుమార్‌ను ప్రశాంత్ కిషర్ ప్రశంసలతో ముంచెత్తినట్లు రాజకీయ వాదనలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amid
- Best Leader
- Bihar
- huge praise
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

