Bangarraju Trailer | సంక్రాంతికి వస్తాయని అనుకున్న ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు అన్నీ తప్పుకున్నాయి. చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేశాయి. కానీ అక్కినేని నాగార్జున మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు అచ్చొచ్చిన సంక్రాంతికే రావాలని ఫిక్సయ్యాడు. 2016లో సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ హిట్ కావడంతో.. అదే సెంటిమెంట్‌తో బంగార్రాజును తీసుకువస్తున్నాడు. జనవరి 14న బంగార్రాజు సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నాగార్జున నుంచి అభిమానులు కోరుకునే అన్ని రకాల కమర్షియల్ హంగులు కనిపించాయి.
బంగార్రాజు బావగారు.. చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు.. అంటూ మీనాక్షి దీక్షిత్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. అందమైన దేవకన్యలతో స్వర్గంలో సోగ్గాడిగా నాగార్జున కబడ్డీ ఆడుతుంటే.. మరో సోగ్గాడిగా నాగచైతన్య అల్లరి చేయడం నవ్వులు పూయించాయి. ఇక మాస్ యాంగిల్లోనూ డైలాగులు, ఫైట్లతో చైతూ అదరగొట్టాడు. ఇక మామిడి తోటలోకి వెళ్లి మాట్లాడుకుందామా అంటూ నాగచైతన్యను కృతి శెట్టి అడగడం.. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తుంటే.. ఈ సంక్రాంతికి అక్కినేని హీరోలు హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న బంగార్రాజు సినిమాకు కృష్ణ కురసాల దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bangarraju | బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్లు.. ఎవరెవరంటే..
Bangarraju censor review | బంగార్రాజు సెన్సార్ పూర్తి.. ఫస్ట్ రివ్యూ ఏంటంటే..
Lahari shari | బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున..
ఏపీ టికెట్ల ధరలతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. నాగార్జున కీలక వ్యాఖ్యలు..