Bangarraju | సంక్రాంతి సినిమాలపై అనుమానాలు పటాపంచలు అయిపోయాయి. పెద్ద సినిమాలన్నీ సైడ్‌కి వెళ్లిపోయాయి. అయినా కూడా నాగార్జున రేస్‌లోనే ఉన్నాడు. ఈయన నటిస్తున్న బంగార్రాజు సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది. తాజాగా నాగార్జున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన సినిమా కచ్చితంగా పండక్కి వస్తుంది అని కన్ఫర్మ్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు తన సినిమాకు ప్రతికూలంగా మారవని అంటున్నాడు. ఏపీలో ఉన్న టికెట్ల రేట్లతో తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు నాగార్జున. ఆ రేట్లు తన సినిమాను ఇబ్బంది పెట్టవని స్పష్టం చేశాడు.
ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ రెండూ పాన్ ఇండియా సినిమాలు అని.. సరైన టైమ్‌లో సినిమా రిలీజ్ అయితేనే వాటికి న్యాయం జరుగుతుందని నాగార్జున చెప్పాడు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని అంటున్నాడు నాగార్జున. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తన సినిమాకు హెల్ఫ్ అవుతాయా లేదా అనేది విడుదల తర్వాత తెలుస్తుందని అన్నాడు. మిగిలిన సినిమాలు వాయిదా పడటం తనకు బాధగా ఉందన్నాడు. జనవరి 14న పండుగలాంటి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నామని చెప్పాడు. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ సినిమాకు సీనియర్ రైటర్ సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించారు. మొత్తానికి పండుగ బరిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా బంగార్రాజు మాత్రమే. మరి ఈ సినిమా ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు.. అందరూ స్టార్ హీరోలే..
Pushpa in OTT | RRR డేట్‌ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే
ట్రిపుల్ ఆర్ బాటలోనే రాధేశ్యామ్.. ఫిల్మ్ రిలీజ్ వాయిదా
షణ్ముఖ్ బాటలోనే సిరి కూడా.. బ్రేకప్ దిశగా అడుగులు..