ట్రిపుల్ ఆర్ బాటలోనే రాధేశ్యామ్.. ఫిల్మ్ రిలీజ్ వాయిదా

ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇప్పడు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ మరోసారి చిత్రసీమను కుదిపేస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్‌ను ఇటీవల వాయిదా వేశారు. ఇప్పుడు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాధేశ్యామ్ ఫిల్మ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియేషన్స్ తన ట్వీట్లో వెల్లడించింది. వాస్తవానికి జనవరి 15వ తేదీన ఈ ఫిల్మ్ రిలీజ్ కావాల్సి ఉంది. పామాలజిస్ట్గా ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాధేశ్యామ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియేషన్స్ తన ట్వీట్లో చెప్పింది. హద్దులులేని ప్రేమను, మద్దతును ఇస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సినిమా థియేటర్లలో రాధేశ్యామ్‌ను కలుసుకోవచ్చు అని యూవీ క్రియేషన్స్ తన ట్వీట్లో తెలిపింది. రాధేశ్యామ్ రిలీజ్‌కు సంబంధించిన కొత్త తేదీలను నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు.
We have to postpone the release of our film #RadheShyam due to the ongoing covid situation. Our sincere thanks to all the fans for your unconditional love and support.
— UV Creations (@UV_Creations) January 5, 2022
We will see you in cinemas soon..!#RadheShyamPostponed pic.twitter.com/aczr0NuY9r
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

