NTR in RRR | తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటాడు. ఈయనకు ఖాళీగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. క్యాలెండర్ ఇయర్ ఖాళీగా వదిలేయడం జూనియర్‌కు అస్సలు నచ్చదు. అలాంటిది ఈయన క్యాలెండర్ ఇయర్లో మూడు సంవత్సరాలు వృథాగా వెళ్లిపోయాయి. రాజమౌళితో సినిమా కమిట్ అయిన తర్వాత 2018 నుంచి ఈయన మరొక సినిమా విడుదల చేయలేదు. కచ్చితంగా రెండేళ్లు ఆయనకు రాసి ఇవ్వాలి అని తెలుసు. కానీ ఆ గ్యాప్ ఇప్పుడు ఏకంగా నాలుగు సంవత్సరాలు అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నుంచి చివరిగా 2018 అక్టోబర్‌లో అరవింద సమేత సినిమా వచ్చింది. 2019, 2020, 2021 లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు జూనియర్ ఎన్టీఆర్.
వరుసగా అరడజన్ విజయాలతో ఫామ్‌లో ఉన్న హీరో ఇంత గ్యాప్ తీసుకోవడం ఇండస్ట్రీకి అస్సలు మంచిది కాదని అంటున్నారు విశ్లేషకులు. ఒక్కో సినిమాకు కనీసం 30 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన రేంజ్ ఇంకా పెరిగింది. సినిమాకు 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఈ లెక్కన మూడేళ్లకు పైగా ఖాళీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంటే కనీసం రూ.150 కోట్లకు పైగా ఆయన నష్టపోయాడు అన్నమాట. ట్రిపుల్ ఆర్ సినిమాకు భారీగానే పారితోషికం అందుకున్న కూడా మరి ఈ స్థాయిలో మాత్రం అందుకోలేదు.
కెరీర్ మొదటి నుంచి కూడా గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కేవలం 2009లో మాత్రమే ఎన్నికల కారణంగా ఏ సినిమా విడుదల చేయలేదు. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా మూడేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. అందుకే ట్రిపుల్ ఆర్ విడుదలైన తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి తగ్గట్టుగానే వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ కోసం కథలు సిద్ధం చేశారు. రాబోయే మూడేళ్ల వరకు జూనియర్ డేట్స్ ఖాళీ లేవు. ఈ లోటు అప్పుడు భర్తీ చేయాలని చూస్తున్నాడు తారక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR వాయిదాతో లాభపడ్డ సినిమాలేవి.. సంక్రాంతికి ఎవరు వస్తున్నారు..?
అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..
RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajamouli: ఆర్ఆర్ఆర్ చిత్రానికి బీజం ఎలా పడిందో చెప్పిన రాజమౌళి
ఆ రోజు హరికృష్ణ లేకపోతే నన్ను చంపేసే వాళ్లు అంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..